అయ్య‌య్యో.. మ‌ద్యంప్రియుల‌కు ఇది షాకింగ్ న్యూసే..! మద్యం ప్రియులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఊహించ‌ని షాక్ ఇచ్చింది. ఏకంగా మద్యం ధరలు 25 శాతం పెంచాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. పెంచిన ధరలతోనే మద్యం అమ్మకాలను ప్రారంభించనున్న‌ట్లు తెలిపింది. అసలే  లాక్‌డౌన్ వల్ల 40 రోజులుగా మద్యం లేక అల్లాడిపోతున్న మందుబాబులకు ఇది మింగుడుప‌డ‌న‌వి ముచ్చ‌టేన‌ని చెప్పొచ్చు. అయితే.. ఏపీ స‌ర్కార్ ఈ నిర్ణ‌యం తీసుకోవ‌డానిక బ‌ల‌మైన కార‌ణ‌మే ఉన్న‌ట్లు తెలుస్తోంది.

 

మద్యపానాన్ని నిరుత్సాహపరిచి, దుకాణాల వద్ద రద్దీ తగ్గించేందుకు ముఖ్య‌మంత్రి జ‌గ‌న్‌ ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. అయితే రానున్న రోజుల్లో క్ర‌మంగా మద్యం దుకాణాల సంఖ్య తగ్గించేందుకు చ‌ర్య‌లు చేప‌ట్ట‌నున్న‌ట్లు స‌మాచారం. అటు కేంద్రం మార్గదర్శకాల ప్రకారం మద్యం దుకాణాలు తెరచుకోనున్న నేప‌థ్యంలో... భౌతిక దూరం పాటించి మద్యం విక్రయించాలని ప్రభుత్వం ఆదేశించింది. వైన్ షాపులకువచ్చే వారు మాస్క్ తప్పనిసరిగా ధరించాలని సూచించింది. దీనిపై మ‌ద్యంప్రియులు ఎలా స్పందిస్తారో చూడాలి మ‌రి. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: