మహారాష్ట్రలో కరోనా మహమ్మారి తీవ్ర స్థాయిలో విజృంభిస్తోంది. దేశంలోనే అత్య‌ధిక కేసులు, మ‌ర‌ణాలు ఇక్క‌డే సంభ‌విస్తున్నాయి. ఈ నేపథ్యంలో అక్కడి ప్రభుత్వం లాక్‌డౌన్ నుంచి కొన్ని సడలింపులను ప్రకటించడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. మరీ ముఖ్యంగా రెడ్‌జోన్లలో కూడా మద్యం విక్రయాలకు ఉద్ధవ్ ప్రభుత్వం అనుమతినివ్వడం వివాదాస్పదంగా మారింది. 

 

అయితే ఆదాయాన్ని సమకూర్చుకునేందుకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నప్పటికీ ప్రజల నుంచి విమర్శలు వ్యక్తమవుతున్నాయి. గ్రీన్, ఆరెంజ్ జోన్లకు మాత్రమే మద్యం విక్రయాలను పరిమితం చేయాల్సిందన్న వాదన వినిపిస్తోంది. ఇదిలా ఉండగా.. మహారాష్ట్రలో లాక్‌డౌన్ అమలు సమయంలో ఏఏ సేవలు అందుబాటులో ఉంటాయో, ఉండవో ఓ జాబితాను ప్రభుత్వం విడుదల చేసింది. ముఖ్యంగా కంటైన్‌మెంట్ జోన్లలో కేవలం నిత్యావసర సరుకులు, మెడికల్ సేవలు, సరుకుల సరఫరాకు మాత్రమే అనుమతిస్తున్నట్లు ప్రభుత్వం స్పష్టం చేసింది. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: