ఏపీ స‌ర్కార్ మ‌రో కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. ఇక నుంచి టెలీమెడిసిన్ సెంట‌ర్ల ద్వారా మందుల‌ను స‌ర‌ఫ‌రా చేసేందుకు నిర్ణ‌యం తీసుకుంది. దీని ద్వారా ప్ర‌జ‌ల‌కు మ‌రింత మెరుగైన వైద్య‌సేవలు అందించేందుకు వీల‌వుతుంద‌ని ప్ర‌భుత్వ‌వ‌ర్గాలు చెబుతున్నాయి. ఆదివారం సాయంత్రం ఏర్పాటు విలేక‌రుల స‌మావేశంలో మంత్రి ఆళ్ల నాని ఈ విష‌యాన్ని వెల్ల‌డించారు. టెలీమెడిసిన్ సెంట‌ర్ల‌ను మ‌రింత స‌మ‌ర్థ‌వంతంగా నిర్వ‌హించాల‌ని ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ ఆదేశించార‌ని ఆయ‌న తెలిపారు. మందుల పంపిణీలో శ్ర‌ద్ధ తీసుకోవాల‌ని సీఎం ఆదేశించార‌ని ఆయ‌న పేర్కొన్నారు. ప్ర‌జ‌లు ఆందోళ‌న చెందాల్సిన అవ‌స‌రం లేద‌ని ఆయ‌న అన్నారు. ఇక వ‌ల‌స కార్మికుల కోసం రాష్ట్ర ప్ర‌భుత్వం ప్ర‌త్యేక విధానం అవ‌లంబిస్తోంద‌ని పేర్కొన్నారు.

 

ప్ర‌తీ గ్రామ స‌చివాల‌యంలో వ‌ల‌స కార్మికుల కోసం ప‌ది బెడ్ల‌కు త‌గ్గ‌కుండా ప్ర‌త్యేక‌ క్వారంటైన్ సెంట‌ర్ల‌ను ఏర్పాటు చేస్తున్న‌ట్లు మంత్రి ఆళ్ల నాని తెలిపారు. ఏపీలో  ఇత‌ర రాష్ట్రాల వారు 12794 మంది ఉన్నార‌ని ఆయ‌న తెలిపారు. వ‌ల‌స కార్మికుల కోసం 9ప్ర‌త్యేక రైళ్లు ఏర్పాటు చేశామ‌ని ఆయ‌న పేర్కొన్నారు. రెడ్‌జోన్ల‌లో స‌రుల‌కు రావాణా కోసం 500 ఆర్టీసీ బ‌స్సులు, మొబైల్ నిత్యావ‌స‌ర సరుకుల వాహ‌నాలను కూడా ఏర్పాటు చేస్తున్నామ‌న్నారు. నిత్యావ‌స‌ర స‌రుకుల కోసం బ‌య‌ట‌కు వెళ్లేందుకు ఇంటికి ఒక‌రికి మాత్ర‌మే పాస్ ఇస్తామ‌ని తెలిపారు. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: