దేశంలో కరోనా వైరస్ మొదట కేరళలాలో మొదలైంది. అక్కడ విదేశాల నుంచి వచ్చిన వారికే ఈ వైరస్ ఎటాక్ అయినట్టు చెప్పారు.  అయితే కరోనా మహమ్మారిని అరికట్టడానికి కేరళాలో గట్టి చర్యలే తీసుకున్నారు.  మొదటి నుంచి ఇక్కడ లాక్  డౌన్ సీరియస్ గా పాటించడంతో చాలా వరకు కేసులు నమోదు కాకుండా వచ్చాయి.  తాజాగా  కేరళలో ఆదివారం కొత్తగా ఒక్క కరోనా కేసు కూడా నమోదు కాలేదని కేరళ ఆరోగ్య శాఖ మంత్రి కెకె శైలజ తెలిపారు. కొత్త కేసులు నమోదు కాకపోవడం పట్ల ఆమె హర్షం వ్యక్తం చేశారు.

 

ఇటీవల కూడా అక్కడ ఒక్క కేసు కూడా నమోదు కాలేదని.. అయితే ఇక్కడ ప్రజల ఆరోగ్యం విషయంలో ఎంతో జాగ్రత్తలు తీసుకుంటున్నారని.. గతంలో పలు మార్లు కేరళాలో ఇలాంటి వైరస్ ఎటాక్ లు ఎన్నో వెలుగు లోకి వచ్చాయని అన్నారు.  ప్రస్తుతం కేరళలో మొత్తం యాక్టివ్ కేసుల సంఖ్య 95. కేరళలో ఇప్పటివరకూ 401 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయినట్లు ప్రభుత్వం ప్రకటించింది.

 

కేరళలో ఇప్పటివరకూ కరోనా వల్ల నలుగురు మరణించారు.  కాగా, ఆదివారం కేరళలో కొత్తగా నాలుగు ప్రాంతాలను కరోనా హాట్‌స్పాట్‌లుగా గుర్తించారు. దీంతో..కేరళలో కరోనా హాట్‌స్పాట్‌ల సంఖ్య 84కు చేరింది. కేరళలో 21,720 మంది అబ్జర్వేషన్‌లో ఉన్నారు. వీరిలో 388 మంది ఆసుపత్రుల్లో ఉండగా, మిగిలిన 21,332 మంది హోం క్వారంటైన్ పాటిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: