భార‌తదేశంలో క‌రోనా మ‌హ‌మ్మారి ఉధృతి త‌గ్గ‌డం లేదు.. రోజురోజుకూ వైర‌స్ తీవ్ర రూపందాల్చుతోంది. రికార్డు స్థాయిలో కొవిడ్‌-19 కేసులు న‌మోదు అవుతున్నాయి. గ‌త 24గంట‌ల్లో 2,487 క‌రోనా పాజిటివ్ కేసులు న‌మోదు కాగా.. 83మంది మ‌ర‌ణించారు. ఇక దేశ‌వ్యాప్తంగా ఇప్ప‌టివ‌ర‌కు మొత్తం 40,263 క‌రోనా వైర‌స్ పాజిటివ్ కేసులు న‌మోదు అయ్యాయి. వీటిలో 28,070 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి.  ఇప్ప‌టివ‌ర‌కు 10,887 మంది క‌రోనా బారి నుంచి కోలుకుని ఆస్ప‌త్రుల ఉంచి డిశ్చార్జ్ అయ్యారు. మొత్తం 1,306 మరణాలు సంభ‌వించిన‌ట్లు కేంద్ర‌ ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ వెల్ల‌డించింది.

 

ఇక ఆదివారం ఉద‌యం వ‌ర‌కు ప‌దిల‌క్ష‌ల యాభైవేల‌కు పైగా క‌రోనా నిర్ధార‌ణ ప‌రీక్ష‌లు చేసిన‌ట్లు ఐసీఎంఆర్ వెల్ల‌డించింది. ఇక ప్ర‌పంచ దేశాల‌తో పోల్చితే భార‌త్‌లోనే క‌రోనా మ‌ర‌ణాలు రేట్ త‌క్కువ‌గా ఉంద‌ని ప్ర‌భుత్వ వ‌ర్గాలు వెల్ల‌డించాయి. ఇదిలా ఉండ‌గా.. రేప‌టి నుంచి లాక్‌డౌన్ 3వ ద‌శ ప్రారంభం కానుంది. ఈ నేప‌థ్యంలో రెడ్‌, ఆరెంజ్‌, గ్రీన్ జోన్ల వారీగా కేంద్ర ప్ర‌భుత్వం జారీ చేసిన మార్గ‌ద‌ర్శ‌కాల‌ను అమ‌లు చేసేందుకు ఆయా రాష్ట్ర ప్ర‌భుత్వాలు రెడీ అవుతున్నాయి. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: