మెగా ఫ్యామిలీ నుంచి ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది నాగ‌బాబు గారాల‌ప‌ట్టి నిహారిక... హీరోయిన్‌గా నిలబడాలని ఎంతో క‌ష్ట‌ప‌డుతోంది. ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్‌ని కూడా పక్కన పెట్టి గ్లామర్‌గా కనిపించడానికి కూడా సిద్ధమ‌యిన‌ట్లు సంకేతాలు ఇస్తోంది. ఇటీవల ఆమె కొన్ని హాట్‌హాట్ ఫొటోలను, రీసెంట్‌గా ఓ సాంగ్‌ను విడుదల చేసింది. అయితే ఇప్పటికే హీరోయిన్‌గా కొన్ని చిత్రాలలో చేసిన నిహారికకు ఆ సినిమాలేవీ మంచి బ్రేక్‌ని ఇవ్వలేకపోయాయి. అందుకే తనలో ఉన్న గ్లామర్ యాంగిల్‌ని కూడా నిహారిక ఫొటోలు, డ్యాన్స్ రూపంలో చూపిస్తుంది. 

తెలుగులో పక్కనపెడితే.. తమిళ్‌లో మాత్రం నిహారికకు బాగానే అవకాశాలు వస్తున్నాయట. ఈ విషయం స్వయంగా నిహారికానే చెప్పింది. తాజాగా ఆమెపై ఓ వార్త హల్‌చల్ చేస్తుండటంతో.. దానిపై నిహారికానే క్లారిటీ ఇచ్చింది. కోలీవుడ్ మీడియాలో తాజాగా నిహారికపై ఒక వార్త ప్రచురితమైంది. ‘ఓ మై కడవులే’ చిత్ర హీరో అశోక్ సెల్వన్ తదుపరి చిత్రంలో హీరోయిన్‌గా నిహారిక ఎంపికైందని, త్వరలోనే ఆ చిత్రం సెట్‌పైకి వెళ్లనుందనేది ఆ వార్తలోని సారాంశం. దీనిపై స్వయంగా నిహారికానే క్లారిటీ ఇచ్చింది. ‘‘అవునవును.. నా తదుపరి చిత్రం అశోక్ సెల్వన్‌తోనే.. ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నా.. షూటింగ్ ఎప్పుడు మొదలవుతుందా.. అని ఆగలేకపోతున్నా..’’ అని ట్వీట్ చేసింది. 

మరింత సమాచారం తెలుసుకోండి: