తెలుగు రాష్ట్రాల్లో కరోనా వైరస్ విజృంభిస్తున్న విషయం తెలిసిందే.  అయితే ఏపిలో కరోనా వైరస్ ప్రభావం బాగా ఉందని ప్రతిపక్షాలు ప్రజలను అనవసరమైన అపోహాలకు గురి చేస్తున్నారని ఏపి వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని అన్నారు.  రాష్ట్రంలో నాలుగు రోజులుగా కరోనా వైరస్ కేసుల సంఖ్య తగ్గుముఖం పట్టాయని  ఇలాంటి సమయంలో ప్రజలను అపోహలకు గురి చేయొద్దని అన్నారు.  ఇప్పటి వరకు ‘కరోనా’ నుంచి కోలుకుని 488 మంది డిశ్చార్జ్ అయ్యారని, కరోనా పరీక్షల సామర్థ్యం మరింత పెంచామని అన్నారు. వలస కూలీల కోసం ప్రత్యేక క్వారంటైన్ సెంటర్లు ఏర్పాటు చేశామని, ప్రతి గ్రామ సచివాలయంలో 10 నుంచి 15 పడకలు సిద్ధం చేస్తున్నట్టు తెలిపారు.

 

ఏపిలో కరోనా విస్తరిస్తుందన్న సమయం నుంచి ఏపిలో అన్ని కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నామని అన్నారు.  ఎక్కడ ఇలాంటి ఇబ్బంది లేకుండా ప్రజలకు అండగా ఏపి ప్రభుత్వం ఉందన్నారు.  అంతే కాదు వివిధ రాష్ట్రాల నుంచి వచ్చేవారికి కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా చేస్తున్నామన్నారు.   రాష్ట్ర వ్యాప్తంగా లక్ష బెడ్స్ సిద్ధం చేయాలని సీఎం జగన్ ఆదేశించారని అన్నారు. ఏపీ ప్రజలకు నిత్యావసరాలు అందుబాటులో ఉంచామని, టెలీ మెడి సిన్ విధానాన్ని మరింత బలోపేతం చేస్తామని చెప్పారు. ప్రతి పీహెచ్ సీలో మందులు అందుబాటులో ఉంచుతున్నామని, మందుల సరఫరాలకు మోటారు వాహనం, కిట్ బ్యాక్ సిద్ధంగా ఉన్నాయని అన్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: