భారత్‌లో కొవిడ్‌-19 విజృంభ‌ణ ఆగ‌డంలేదు. మొత్తం కరోనా  పాజిటివ్ కేసుల సంఖ్య 40 వేలు దాటింది. ఒకే రోజు రికార్డు స్థాయిలో కేసులు నమోద య్యాయి. ఆదివారం  2487 కొత్త కరోనా పాజిటివ్ కేసులు న‌మోద‌య్యాయి. ఒకే రోజు ఇంత భారీ స్థాయిలో కేసులు నమోదవ‌డం ఇదే తొలిసారి.  ఇక దేశంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 40,263 చేరింది. 

 

అందులో 10,887 మంది డిశ్చార్జ్ అయ్యారు. 28,070 యాక్టివ్ కేసులు ఉన్నాయి. 1306 మంది ప్రాణాలు కోల్పోయారు. 24 గంటల్లో 83 మంది కరోనాతో చనిపోయారు. దేశంలో ఇప్పటి వరకు 10 లక్షలకు పైగా కరోనా పరీక్షలు నిర్వహించారు. మహారాష్ట్రలో అత్యధికంగా 12,296 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఆ తర్వాత గుజరాత్ (5054) , ఢిల్లీ (4122), మధ్యప్రదేశ్ (2846), రాజస్థాన్ (2770), తమిళనాడు (2757)లో రెండువేలకు పైగా కరోనా కేసులు నమోదయ్యాయి. ఏపీలో 1525, తెలంగాణలో1063 కేసులు ఉన్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: