దేశంలో లాక్‌డౌన్ ముగిసిన తర్వాత ఢిల్లీ విమానాశ్రయంలోని టెర్మినల్ 3 నుంచి తొలుత విమాన సర్వీసులు ప్రారంభం కానున్నాయి. ప్రయాణికులు గుమికూడకుండా ఎంట్రీ గేటులు, సెల్ఫ్ చెక్ ఇన్ మెషిన్లు, చెక్ ఇన్ బేస్‌లను విమానయాన సంస్థలకు కేటాయించనున్నారు. విమానాశ్రయంలో ఆహారం, పానీయాలు అందుబాటులో ఉంటాయని, షాప్స్ తెరుచుకుంటాయని అదికారుల పేర్కొన్నారు. 

 

విస్తారా, ఇండిగో ప్రయాణికులు గేట్ 1, 2 ద్వారా విమానాశ్రయంలోకి రావాలని, ఈ రెండు సంస్థలకు చెక్ ఇన్ వరుసలు ఎ, బి, సిలలో ఉంటాయని తెలిపారు. ఎయిర్ ఏషియా, ఎయిర్ ఇండియా ప్రయాణికులు 3, 4 గేట్లను ఉపయోగించుకోవాలని, అనంతరం వారు డి, ఈ, ఎఫ్‌ వరుసను ఉపయోగించుకోవాలని, అక్కడ ఈ రెండు సంస్థలకు చెందిన సిబ్బంది చెక్ ఇన్ చేస్తారని పేర్కొన్నారు.  స్పైస్‌జెట్, గో ఎయిర్ ప్రయాణికులు ఐదో నంబరు గేటు ద్వారా ప్రవేశించాలని, వీరి చెక్ ఇన్ రోలు జి, హెచ్ అని వివరించారు. అలాగే, దేశీయ ప్రయాణికులందరూ ఐదో నంబరు గేటు ద్వారా ప్రవేశించి హెచ్‌ రోలో చెక్ ఇన్ చేయించుకోవాలని కోరారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: