భార‌త్‌లో అత్య‌ధిక కేసులు న‌మోదు అవుతున్న రాష్ట్రాల్లో గుజ‌రాత్ ఒక‌టి. ఈ రాష్ట్రంలో రోజురోజుకూ పాజిటివ్ కేసుల సంఖ్య పెరిగిపోతోంది. ఆదివారం 374 కొత్త కొవిడ్ -19 పాజిటివ్‌ కేసులు, 28 మరణాలు నమోదయ్యాయని, ఇది ఇప్పటివరకు ఒకే రోజు న‌మోదు అయిన మరణాలలో అత్యధికమ‌ని ఆరోగ్య శాఖ అధికారి తెలిపారు. దీంతో రాష్ట్రంలో కరోనావైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య 5,428 కు, మరణాల సంఖ్య 290 కి పెరిగింది. ఇందులో అహ్మదాబాద్‌లో అత్యధికంగా 274 కొత్త కేసులు న‌మోదు అయ్యాయి. ఆ త‌ర్వాత సూరత్, వడోదరలో  25 పాజిటివ్ కేసుల చొప్పున న‌మోదు అయ్యాయి. ఇక ఈ రోజు 146 మంది క‌రోనా రోగులు డిశ్చార్జ్ అయ్యారు.

 

రాష్ట్రంలో కోలుకున్న మొత్తం రోగుల సంఖ్య 1,042 కు చేరుకుందని అధికార‌వ‌ర్గాలు వెల్ల‌డించాయి. ఇదిలా ఉండ‌గా.. ఇటీవ‌ల రాజ్‌కోట్‌లో ఓ ప్రైవేట్ పాఠ‌శాల‌ను తెరవ‌గా.. సుమారు వంద‌మంది విద్యార్థులు హాజ‌రవ‌డంతో క‌ల‌క‌లం రేగిన విష‌యం తెలిసిందే. ప్ర‌ధానంగా రాజ‌ధానిలో కేసులు ఎక్కువ‌గా న‌మోదు అవుతుండ‌డంతో ప్ర‌జ‌ల్లో ఆందోళ‌న వ్య‌క్త‌మ‌వుతోంది. ముఖ్య‌మంత్రి విజ‌య్ రూపానీ నిరంత‌రం అధికారుల‌ను అప్ర‌మ‌త్తం చేస్తూ.. క‌రోనా వైర‌స్ వ్యాప్తి క‌ట్ట‌డికి చ‌ర్య‌లు తీసుకుంటున్నారు. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: