దేశంలో కరోనా కట్టడి చేయడానికి లాక్ డౌన్ ప్రకటించిన విషయం తెలిసిందే.  అప్పటి నుంచి లాక్ డౌన్ కొనసాగిస్తున్న నేపథ్యంలో పోలీసులు కఠినంగా వ్యవహరిస్తున్నారు.  లాక్ డౌన్ ఉల్లంఘన చేసిన వారికి తీవ్రమైన శిక్షలు విధిస్తున్న విషయం తెలిసిందే.  తాజాగా ఉత్తరప్రదేశ్‌లోని ఎటావా ప్రాంతంలో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఓ యువకుడిని ఓ పోలీసు ఇష్టం వచ్చినట్లు కొట్టాడు. ఇందుకు సంబంధించిన దృశ్యాలను స్థానికులు మొబైల్‌ ఫోన్‌లో చిత్రీకరించారు. ఈ వీడియో సమాజ్ వాదీ పార్టీ తమ అధికారిక ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేసింది. తనను కొట్టొద్దని ఆ యువకుడు చేతులెత్తి వేడుకుంటున్నప్పటికీ కనికరం లేకుండా లాఠీతో పోలీసు దారుణంగా కొట్టాడు.

 

ఆ యువకుడి ఛాతిపై కాలు పెట్టి పిచ్చి కుక్కను కొట్టినట్టు కొట్టాడు.  అయితే ఈ విషయం పై  స్పందించిన ఉన్నతాధికారులు వివరణ ఇచ్చారు. బాధితుడు సునీల్‌ యాదవ్‌ మానసిక స్థితి బాగోలేదని, అతడు తాగుడుకు అలవాటు పడి గ్రామస్థులపై దాడులకు పాల్పడుతున్నాడని చెప్పారు. అయితే తాను ఎందుకు కొట్టనో అన్న విషయం పై క్లారిటీ ఇచ్చాడు.. గ్రామస్తుల ఫిర్యాదు మేరకు  ఇద్దరు పోలీసు కానిస్టేబుళ్లు అక్కడకు వెళ్లారని తెలిపారు. అతడిని కొట్టిన కానిస్టేబుల్‌ను సస్పెండ్ చేసినట్లు వివరించారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: