IHG

నిన్న మొన్నటి వరకు ప్రపంచమంతా కొరియా అధ్యక్షుడు కిమ్ కి ఏమైంది, కిమ్ బ్రతికే ఉన్నాడా, కిమ్ చనిపోయాడా అంటూ ప్రపంచమంతా అదేపనిగా అరా తీసింది. ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానం చెబుతూ కిమ్ సుక్రవారం నాడు ప్రత్యేక్షమయ్యాడు. అయితే వచ్చిన వెంటనే ఓ ఎరువుల ఫ్యాక్టరీ ని  ఓపెనింగ్ చేయడానికి  అక్కడకు వచ్చినప్పుడు తన సోదరి ఇచ్చిన కత్తెర తో ఆ ఫ్యాక్టరీ కి రిబ్బన్ కట్ చేసి అందరిని అబ్బురపరచాడు.

IHG

 

ఇలా వచ్చాడో లేదు అప్పుడే తన నియంత పనులను ప్రారంభించేశాడు. కిమ్ వచ్చిన తరువాత రెండు కొరియన్ దేశాలు సరిహద్దుల వద్ద కాల్పులకు దిగాయి. ఇందులో దక్షిణ కొరియా కి ఎటువంటి ప్రాణ నష్టం కలుగలేదని వెల్లడించింది.అయితే దక్షిణ కొరియా మాత్రం ఉత్తర కొరియా నే ముందుగా తమపై కాల్పులు చేసిందని చెబుతోంది. కాల్పుల నేపథ్యంలో ఉత్తరకొరియా అధికారులతో సంప్రదింపులు జరుపుతున్నట్లు పేర్కొంది. కాగా కాల్పుల ఘటనతో సరిహద్దుల వద్ద ఉద్రిక్తత నెలకొంది.

మరింత సమాచారం తెలుసుకోండి: