టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బావ సుధీర్ బాబు కూడా నటుడిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపును సొంతం చేసుకుంటున్నాడు. ఎవరినీ అనుకరించకుండా.. కథలో కొత్తదనం ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటూ ఇండస్ట్రీలో నిలదొక్కుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాడు. ఈక్రమంలో తెలుగులోనే కాక అప్పుడప్పుడు హిందీ భాషలోనూ వైవిధ్యమైన పాత్రలు పోషిస్తున్నాడు. అయితే.. సుధీరబాబు గురించి ఇదంతా ఇప్పుడెందుకు చెబుతున్నారని అనుకుంటున్నారా..? ఇక్కడ తాజాగా.. సుధీర్‌బాబు తనలోని టాలెంట్‌ను చూపించాడు. ఆ టాలెంట్ చూస్తే మనందరం నోరెళ్లబెట్టాల్సిందేమరి. ప్రస్తుతం కరోనా వైరస్ కట్టడికి దేశవ్యాప్తంగా కొనసాగుతున్న లాక్డౌన్ కారణంగా సెలబ్రిటీలందరూ ఇళ్లకే పరిమితమైపోయారు.
ఇంట్లోనే ఉంటున్న సుధీర్‌బాబు అనేక విన్యాసాలు చేస్తున్నాడు . తన ఫిట్నెస్ కోసం అప్పుడప్పుడు స్టంట్ వీడియోలు చేస్తూ వస్తున్న సుధీర్ బాబు తాజాగా గాల్లోకి ఎగిరి రెండు కాళ్లని పట్టుకున్నాడు. ఆ వీడియోను పోస్ట్ చేశాడు. ఇంకేముంది.. ఇది చూసిన నెటిజన్స్ ఫిదా అయిపోతున్నారు. గతంలో సుధీర్ బాబు గాల్లోనే శీర్షాసనం వేసి అందరిని ఆశ్చర్యపరచిన విషయం తెలిసిందేకదా...! ముందుముందు ఇంకెన్ని విన్యాసాలు చేస్తాడో చూడాలి మరి.
No, I wasn't checking the range of Gravity on the floor 🤣🤣 #quarantineworkouts pic.twitter.com/cKEuz7X9z9
— Sudheer Babu (@isudheerbabu) May 3, 2020