తెలుగు రాష్ట్రాల్లో కరోనా నానాటీకి విజృంభిస్తుంది.  ముఖ్యంగా తెలంగాణలో కొన్ని ఏరియాల్లో పెద్దగా ప్రభావం చూపకున్నా.. హైదరాబాద్ లో ఈ కరోనా ప్రభావం పెరిగిపోతుంది.  ఈ క్రమంలోనే కొన్ని ఏరియాలు రెడ్ జోన్లుగా ప్రకటించిన విషయం తెలిసిందే.   వనస్థలిపురంలోని హుడా సాయినగర్, సుష్మా సాయినగర్, కమలానగర్, రైతుబజార్ సమీపంలోని ఏ, బీ టైప్ కాలనీలు, ఫేజ్-1 కాలనీ, సచివాలయనగర్, ఎస్కేడీ నగర్ లతో పాటు రైతు బజార్-సాహెబ్ నగర్ రహదారిని కూడా కంటైన్మెంట్ జోన్లుగా ప్రకటించారు. మూడు కుటుంబాల్లో 11 మందికి కరోనా సోకడంతో ఆ ప్రాంత ప్రజలు భయాందోళనకు లోనవుతున్నారు. 139 కుటుంబాలను హోమ్ క్వారంటైన్ లో ఉండాలని అధికారులు సూచించారు.  

 

అయితే ఎల్‌బి నగర్ ఎంఎల్‌ఎ సుధీర్ రెడ్డి వనస్థలిపురంలో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతు.. మలక్‌పేటలోని గంజ్ నుంచి ఈ ప్రాంతానికి కరోనా వైరస్ వ్యాపించిందని తెలిపారు. ఈ ఏరియాల్లో  అధికారు పారిశుధ్య పనులు చేపట్టడంతో పాటు హైపోక్లోరైడ్ ద్రావణం పిచికారీ చేస్తున్నారు.  భారత దేశంలో ఇప్పటి వరకు 42,670 మందికి కరోనా వైరస్ సోకగా 1395 మంది మృతి చెందారు.

 

తెలంగాణ కరోనా బాధితుల సంఖ్య 1082కు చేరుకోగా 29 మంది మృత్యువాతపడ్డారు. ప్రపంచంలో కరోనా వైరస్ 35.66 లక్షల మందికి సోకగా 2.48 లక్షల మంది చనిపోయారు. కాగా, వనస్థలిపురంలోని 8 కాలనీలను కంటైన్మెంట్ జోన్లుగా గుర్తించారు. ఈ కంటైన్మెంట్ జోన్లలో రేపటి నుంచి వారం రోజుల పాటు రాకపోకలు నిలిచిపోనున్నాయి. ఈ జోన్ల పరిధిలోని నివాసాల పరిసరాల్లో కఠిన ఆంక్షలు విధించారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: