ఏపీలో క‌రోనా వైర‌స్ ప్ర‌భావం ఏమాత్ర‌మూ త‌గ్గ‌డం లేదు. రోజురోజుకూ పాజిటివ్ కేసులు ఎక్కువ‌గా న‌మోదు అవుతున్నాయి. సోమ‌వారం మ‌ధ్యాహ్నం ప్ర‌భుత్వం క‌రోనా హెల్త్ బులెటిన్‌ను విడుద‌ల చేసింది.  కేవ‌లం గ‌త‌ 24గంట‌ల వ్య‌వ‌ధిలోనే 67 కేసులు నమోదు అయ్యాయి. దీంతో ఇప్ప‌టివ‌ర‌కు రాష్ట్ర వ్యాప్తంగా క‌రోనా పాజిటివ్ కేసుల సంఖ్య‌‌  1650కు చేరుకుంది. ఇక‌ 1093 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇప్ప‌టివ‌ర‌కు 33మంది మృతి చెందారు. క‌రోనా నుంచి 524మంది కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. గ‌త‌ 24 గంట‌ల్లో క‌ర్నూలులో 25, గుంటూరులో 19, కృష్ణాలో 12, విశాఖ 6,  క‌డ‌ప‌లో 4 చిత్తూరులో ఒక కేసులు న‌మోదు అయ్యాయి. ఇక  నెల్లూరు, ప్ర‌కాశంతో పాటు మిగ‌తా జిల్లాల్లోనూ ఎటువంటి కేసులు న‌మోదు కాలేదు.

 

ఇక ఎప్ప‌టిలాగే.. క‌ర్నూలు, గుంటూరులోనే అత్య‌ధిక కేసులు న‌మోదు అవుతున్నాయి. ఈ నేప‌థ్యంలో ఆయా జిల్లాల ప్ర‌జ‌లు తీవ్ర ఆందోళ‌న‌కు గుర‌వుతున్నారు. మ‌ళ్లీ నిన్న‌మొన్న‌టిక‌న్నా పాజిటివ్ కేసులు ఎక్కువ‌గా న‌మోదు కావ‌డంతో ప్ర‌భుత్వం మ‌రింత క‌ట్టుదిట్ట‌మైన చ‌ర్య‌లు తీసుకుంటోంది.  మ‌రోవైపు.. ఈ రోజు ఏపీలో రెడ్ జోన్లు మిన‌హా అన్ని ప్రాంతాల్లో మ‌ద్యం షాపుల‌కు అనుమ‌తి ఇచ్చింది ప్ర‌భుత్వం. ఈ నిర్ణ‌యం తీవ్ర చ‌ర్చ‌నీయాంశంగా మారుతోంది. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: