తెలంగాణలో కరోనా కేసులు చాపకింద నీరులా వ్యాప్తి చెందుతున్నాయి. అక్కడ క‌రోనా కట్టడికి ప్రభుత్వం ఎన్ని చర్యలు తీసుకున్నా కరోనా కేసులు మాత్రం ఆగడం లేదు. ఈ క్రమంలోనే తెలంగాణాలోని ఒక జిల్లా కేంద్రంలో అనూహ్యంగా కరోనా కేసులు ఎక్కువగా నమోదు కావడం అందరికీ షాక్ ఇచ్చింది. ఓ మహిళ అష్టా చమ్మ ఆడడంతో ఆమె ద్వారా ఎక్కువ మందికి క‌రోనా సోకింద‌న్న‌ నిర్ధారణ వచ్చింది. అయితే ఈ విచారణలో మరో షాకింగ్ విషయం కూడా వెలుగులోకి వచ్చింది. ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఉన్న ప్రధాన పట్టణంలో భారీగా కేసులు నమోదు కావడానికి ఒక అక్రమ సంబంధం అని తేలింది. దీంతో అధికార వర్గాలు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నాయి.

 

మ‌ర్క‌జ్ వెళ్లిన ఓ వ్య‌క్తి నుంచి ఓ మెడిక‌ల్ షాపు య‌జ‌మానికి క‌రోనా సోకింది. ఆ మెడిక‌ల్ షాపు య‌జ‌మాని నుంచి అత‌డు వివాహేత‌ర సంబంధం న‌డుపుతోన్న ఓ కిరాణా దుకాణం మ‌హిళ‌కు సోకింది. ఆమె ఓ చేప‌లు అమ్మే అమ్మాయితో చ‌నువుగా ఉండేది. ఆ వైర‌స్ అలా ఆ చేప‌లు అమ్మే అమ్మాయికి వ‌చ్చింది. ఆమె లాక్ డౌన్ వ‌ల్ల చేప‌లు అమ్మ‌కం లేక చుట్టు ప‌క్క‌ల అమ్మ ల‌క్క‌ల‌ను పోగేసి ఆష్టాచెమ్మా ఆడింది. ఆమె నుంచి  అష్టాచెమ్మా ఆడిన వారందరికీ కరోనా పాజిటివ్ రావడం తో ఒక్కసారిగా ఆ పట్టణంలో కరోనా కేసులు భారీగా పెరిగాయి. 

 

ఈ విధంగా ఒక అక్రమ సంబంధం ద్వారా ఆ పట్టణమంతా భారీగా కరోనా కేసులు నమోదు కావడం విస్తుగొల్పుతోంది. ఈ వార్త తెలిసి ప్రజలందరూ షాక్ కు గురవుతున్నారు. అలా న‌ల్ల‌గొండ‌లో ఒక్క అక్ర‌మ సంబంధంతో ఊర్లో చాలా క‌రోనా కేసులు న‌మోదు అయ్యాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: