క‌రోనా మ‌హ‌మ్మారి విష‌యంలో అధికార వైసీపీ, ప్ర‌తిప‌క్ష టీడీపీ నేత‌ల మ‌ధ్య ట్విట్ట‌ర్ వార్ రోజురోజుకూ ముదురుతోంది. ప‌ర‌స్ప‌ర విమ‌ర్శ‌ల‌తో వేడిపుట్టిస్తున్నారు. క‌రోనా క‌ట్ట‌డి విష‌యంలో దేశంలోనే ఏపీ ఆద‌ర్శంగా నిలుస్తోంది, అత్య‌ధిక క‌రోనా నిర్ధార‌ణ ప‌రీక్ష‌లు చేస్తున్న రాష్ట్రంగా ఏపీ నిలిచింద‌ని అధికార వైసీపీ నేత‌లు చెబుతున్నారు. కానీ, చంద్ర‌బాబు మాత్రం వైసీపీ ప్ర‌భుత్వంపై తీవ్ర‌స్థాయిలో విమ‌ర్శ‌లు గుప్పిస్తున్నారు. తాజాగా.. ఈ రోజు కూడా మ‌ద్యం షాపుల మందు మందుబాబులు బారులు తీరిన వీడియోల‌ను షేర్ చేశారు చంద్ర‌బాబు. ఈ వీడియోల‌ను చూసి షాక్‌కు గుర‌య్యానంటూ ట్వీట్ చేశారు. ముంద‌స్తు ప్లానింగ్ లేకుండా చేస్తే ఇలాగే ఉంటుందంటూ విమ‌ర్శ‌లు చేశారు.

 

తాజాగా.. వైసీపీ నేత‌, రాజ్య‌స‌భ స‌భ్యుడు విజ‌య‌సాయిరెడ్డి తీవ్ర‌స్తాయిలో చంద్ర‌బాబుపై విరుచుకుప‌డ్డారు. *సీఎం జగన్ గారు కరోనాపై యుద్ధంలో తలమునకలై ఉంటే, బాబు, భజన మీడియా ఆయన ప్రతిష్టను అడ్డుకోవడానికి కుతంత్రాలు పన్నుతున్నారు. రాష్ట్ర ప్రజల శ్రేయస్సు కంటే తమ ఉనికి ప్రశ్నార్థ‌కం అవుతుందనే భయం పట్టుకుంది. ఇంకా నాలుగేళ్ల సమయం మిగిలి ఉంది. అప్పుడే వెన్నుచూపి పారిపోతే ఎలా బాబూ?* అంటూ ట్వీట్ చేశారు. ఇక దీనిపై చంద్ర‌బాబు, భ‌జ‌న మీడియా ఎలా స్పందిస్తుందో చూడాలి మ‌రి. 

 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: