ప్రతి వేసవి కాలంలో తప్పకుండ ప్రతి ఇంట్లో ఆవకాయ తయారు చేయడం మాములు. లాక్ డౌన్ కారణంగా కొంతమంది ఆవకాయ పెట్టాలన్న విషయాన్నే మరచిపోయారు. హోమ్ క్వారంటైన్ లో ఉన్న అందరూ సినీప్రముఖులు తమతమ స్టయిల్ లో  తమకు తోచిన సలహాలు సూచనలు చేస్తూ ఉంటారు. అందుకు మెగా ఫామిలీ ఏమి తక్కువకాదు ...ఇన్ని రోజులు తమ ప్రొఫెషన్ లో బిజీ గా ఉన్న మెగా కుటుంభం ఇప్పుడు లాక్ డౌన్ పుణ్యమాని కుటుంభం అంతా కలసి హ్యాపీగా గడుపుతున్నారు, చిరు  కుటుంబాన్ని చూస్తే చాల ముచ్చటగొలుపుతుంది.

IHG

 

తాజాగా కొణిదెల  వారి కోడలు ఉపాసన దోమకొండ స్పెషల్ ఉరగాయను పరిచయం చేసింది. ప్రస్తుతం ఈ ఆవకాయ కి సంబందించిన తయారీ విధానాన్ని ఓ వీడియో ద్వారా పంచుకుంది. ఇదంతా రామ్ చరణ్ షూట్ చేస్తూ ఉండగా అందుకు కావలసిన ఊరగాయ వస్తువులను ఆమె కలుపుతూ పచ్చడిని తయారు చేసింది. ఇందులో విశేషం ఏమిటంటే ..ఈ పచ్చడిని నాలుగు దశల వారీగా తయారు చేసింది అయితే బెల్లంను కలపడం ఈ పచ్చడి యొక్క విశేషం ... ఆమె దీనికి సంబందించిన విషయాలను ట్వీట్ చేస్తూ ..“నేను నా మొదటి అవకాయ పచాడిని చేసాను. ఇది పురాతన # డోమకొండ వంటకం ❤️. ఇది ఫ్యాబ్ " అని తేలింది. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: