ఎన్నాళ్లో వేచిన ఉదయం.. ఈనాడే ఎదురౌతుంటే.. అన్నట్లు గత 40 రోజులుగా మందుకు ముఖం వాచి పోయిన ఎంతో మంది తాగు బోతులకు నేటి నుంచి మద్యం షాపులు తెరుచుకోవడంతో ప్రాణం లేచి వచ్చినట్టయ్యింది.   ఏపీలో ఈరోజు నుంచి మద్యం అమ్మకాలు ప్రారంభమైన విషయం తెలిసిందే. పొరుగు రాష్ట్రమైన తమిళనాడులో ప్రస్తుతం మద్యం అమ్మకాలపై నిషేధం ఉండటంతో అక్కడి మందుబాబులు ఇక్కడికి వస్తున్నారు.  ఈ క్రమంలో నెల్లూరు జిల్లాలోని ఏపీ, తమిళనాడు సరిహద్దుల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. సరిహద్దు గ్రామాల ప్రజలు సమీపంలోని  వైన్‌ షాపుల దగ్గర భారీగా తరలిరావడంతో కిలోమీటర్ల మేర క్యూలో నిలబడి మద్యాన్ని కొనుగోలు చేశారు. 40 రోజుల తర్వాత వైన్‌ షాపులు తెరవడంతో   సందడి వాతావరణం నెలకొంది. 

 

జీవీపాలెం, రామాపురంలోని మద్యం దుకాణాల వద్దకు  తమిళనాడు వాసులు వస్తుండటంతో ఈ పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో జీవీపాలెం, రామాపురంలోని 7 మద్యం దుకాణాల వద్దకు పోలీసులు చేరుకున్నారు. మద్యం షాపులను మూసివేయించి తమిళనాడు వాసులను వెనక్కి పంపిస్తున్నారు.    ఏపీలో మద్యం ధరలను ప్రభుత్వం 25శాతం పెంచిన విషయం తెలిసిందే. రద్దీ ఎక్కువగా ఉంటే షాపులను కొంతసేపు మూసివేస్తున్నారు. 

 

ఇక గుంటూరు జిల్లాలోని మాచవరం, పిల్లుట్లలోని మద్యం దుకాణాల వద్ద మందుబాబులు బారులు తీరారు. ఇతర గ్రామాల వారు తమ గ్రామంలోని మద్యం దుకాణాల వద్దకు రావడంపై పిల్లుట్ల గ్రామస్తులు ధర్నాకు దిగారు. రెడ్ జోన్ల లో ఉన్న వారు గ్రీన్ జోన్లలోకి మద్యం కొనుగోలు నిమిత్తం రావడాన్ని వారు నిరసిస్తూ ఈ ధర్నాకు దిగారు.  ఏది ఏమైనా మొన్నటి వరకు మద్యం షాపులు తీస్తే చాలా సిన్సియర్ గా ఉంటూ సామాజిక దూరం పాటిస్తామని చెప్పిన తాగుబోతురాయుళ్లు ఇప్పుడు మద్యం షాపులు చూడగానే రెచ్చిపోతున్నారు. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: