తమిళనాడులో కరోనా మహమ్మారి అతి వేగంగా విస్తరిస్తున్నది. రోజురోజుకూ పాజిటివ్‌ కేసుల సంఖ్య అంత‌కంత‌కూ పెరిగిపోతోంది. సోమవారం ఒక్కరోజే కొత్తగా ఏక‌గా 527 మందికి కరోనా వైర‌స్‌ సోకింది. దీంతో రాష్ట్రంలో నమోదైన మొత్తం కేసుల సంఖ్య 3,550కి చేరిందని తమిళనాడు ఆరోగ్య విభాగం అధికారులు తెలిపారు. మొత్తం కేసుల్లో 1,409 మంది వైరస్‌ బారి నుంచి పూర్తిగా కోలుకుని ఆస్ప‌త్రుల నుంచి డిశ్చార్జి అయ్యారని పేర్కొన్నారు.  31 మంది మరణించారని, మిగతా 2,108 మంది వివిధ ఆస్పత్రుల్లో చికిత్సి పొందుతున్నారని అధికారులు తెలిపారు.

 

ఇ దేశ వ్యాప్తంగా గత 24 గంటల్లో 2,573 కొత్త కేసులు న‌మోదుకాగా  83 మరణాలు సంభ‌వించాయ‌ని కేంద్ర ప్రభుత్వం వెల్ల‌డించింది. దీంతో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 42,836కు చేరుకుంది. ప్ర‌స్తుతం  29,685 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇప్ప‌టివ‌ర‌కు 11,762మంది క‌రోనా బారి నుంచి కోలుకుని ఆస్ప‌త్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యార‌ని అధికారులు తెలిపారు. ఇక మరణించిన వారి సంఖ్య 1,389కు చేరుకుంది. అయితే.. గ‌త కొద్దిరోజులుగా ప్ర‌తీ రోజు రెండువేల‌కుపైగానే పాజిటివ్ కేసులు న‌మోదు అవుతుండ‌డంతో ప్ర‌జ‌ల్లో తీవ్ర ఆందోళ‌న వ్య‌క్తమ‌వుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: