వినూత్నంగా ఆలోచించడం లో ముంబై పోలీసులు ముందుంటారు. ఎప్పటి కప్పుడు ప్రజలను చైతన్య పరచుటానికి నానావిధాలుగా ప్రయత్నాలు చేస్తుంటారు. ముంబై లో ఓ మోస్తరులో కరోనా కట్టడి జరిగిందంటే అది అంతకుడా ముంబై పోలిసుల చలవే. తాజాగా వీరు లూడో గేమ్ కి సంబందించిన గేమ్ బోర్డు ను సోషల్ మీడియాలో పోస్ట్ చేసి ముంబై వాసులను చతన్యం చేశారు. ఈ లూడో గేమ్ లో నలుగురు పోటీదారులు తమ ఇంట్లో ఉంటారు. బయట కరోనా వైరస్ పోలిన ఆకారాలు ఆ నాలుగు ఇళ్ల చుట్టూ తిరుగుతూ ఉంటాయి.

IHG

 

అయితే ముంబై పోలీసులు దీనిగురించి చాల చక్కగా వివరించారు అదేంటంటే ...నాలుగు జోన్ లను హోమ్ గాను ...ఆ బయట కరోనా ఉన్నట్లు వారు చిత్రీకరించారు. ఇంటినుండి బయటకు వస్తే కరోనా కబళిస్తుందని ఆ చిత్రం ద్వారా ముంబై పోలీసులు తమ ట్విట్టర్ ఖాతా ద్వారా తెలియజేశారు. బాలీవుడ్ అందాల నటి పరిణీతి చోప్రా ఈ పోస్ట్ ను తెగ లైక్ చేసింది ..అదే అదనుగా నాలుగు విభిన్న హార్ట్స్ తో ఆ ట్వీట్ ను రీ ట్వీట్ చేసింది . ముంబై పోలీసులు పెట్టిన ఈ పోస్ట్ ను సోషల్ మీడియాలో తెగ లైక్ లు కొడుతున్నారు. ఈ పోస్ట్ కి ఇప్పటివరకు 4K లైక్ లు వచ్చాయి ...

"కొన్ని సమయాల్లో, మీ అదృష్టాన్ని ప్రయత్నించకపోవడమే మంచిది. నవల కరోనావైరస్కు వ్యతిరేకంగా ఇంట్లో ఉండటమే మీ ఉత్తమ పందెం. #GameOfLife #TakingOnCorona," వారు ట్వీట్కు శీర్షిక పెట్టారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: