పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో కరోనా మహమ్మారి శరవేగంగా విజృంభిస్తోంది. రాష్ట్రంలో కరోనా బాధితుల సంఖ్య, మృతుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. రాష్ట్రంలో ఈరోజు 11మంది కరోనా భారీన పడి మృతి చెందారు. ఇప్పటివరకు రాష్ట్రంలో 61 మంది వైరస్ భారీన పడి మృతి చెందారు. రాష్ట్రంలో గడచిన 24 గంటల్లో 61 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఈరోజు నమోదైన కేసులతో కలిపి రాష్ట్రంలో కరోనా బాధితుల సంఖ్య 1259కు చేరింది. 
 
పశ్చిమ బెంగాల్ రాష్ట్ర కార్యదర్శి రాజీవ్ సిన్హా ఈ వివరాలను ప్రకటించారు. ఒకేరోజు 11 మంది మృతి చెందటంతో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. ప్రభుత్వం రాష్ట్రంలో లాక్ డౌన్ నిబంధనలు కఠినంగా అమలు చేస్తోంది. అయినా రాష్ట్రంలో కొత్త కేసులు నమోదవుతున్నాయి. మరోవైపు దేశవ్యాప్తంగా కరోనా బాధితుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. దేశవ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య 42,836కు చేరింది. 
 

మరింత సమాచారం తెలుసుకోండి: