దేశవ్యాప్తంగా కరోనా మహమ్మారి వేగంగా విజృంభిస్తోంది. కరోనా బాధితుల సంఖ్య, మృతుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. కరోనాను కట్టడి చేయడం కోసం వైద్యులు 24 గంటలు నిరంతరం పోరాటం చేస్తున్నారు. నిన్న వారు చేస్తున్న కృషికి అపూర్వ గౌరవంగా వాయుసేన పూల వర్షం కురిపించింది. హెలికాఫ్టర్ల ద్వారా హైదరాబాద్ లోని గాంధీ ఆస్పత్రి, విశాఖ చెస్ట్, గీతం ఆస్పత్రులపై పూల వర్షం కురిసింది. 
 
వైద్య సిబ్బందికి సంఘీభావంగా నావీ సముద్ర తీరాల్లో నౌకలు నిలిపి కృతజ్ఞత చాటుకుంది. పూల వర్షం వైద్యుల గొప్ప సేవలకు దక్కిన అపూర్వ గౌరవమని అందరూ హర్షం వ్యక్తం చేస్తున్నారు. కానీ కొందరు మాత్రం ఈ పూల వర్షంపై విమర్శలు చేస్తూ ఉండటం గమనార్హం. కొందరు పూల ఖర్చుతో మాస్కులు పంపిణీ చేయవచ్చు కదా...? వలస కార్మికులకు ఆహారం పంపిణీ చేయవచ్చు కదా...? పూల ఖర్చుతో జీతం ఎక్కువ ఇవ్వవచ్చు కదా..? అని విమర్శలు చేస్తున్నారు. 
 
కరోనా కట్టడి కోసం 24 గంటలు శ్రమిస్తూ, సేవలందిస్తున్న కరోనా వైద్యులపై పూలు జల్లినా పలువురు విమర్శలు చేస్తూ ఉండటం గమనార్హం. 
 
 

మరింత సమాచారం తెలుసుకోండి: