ఏపీ సీఎం వైయస్ జగన్మోహన్ రెడ్డి తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలో కరోనా కేసులు పెరుగుతూ ఉండటంతో ప్రభుత్వంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈ క్రమంలో తాజాగా జగన్ సర్కార్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వం ఇటీవల కొనుగోలు చేసిన 108, 104 వాహనాల్లో వెంటిలేటర్లను ఏర్పాటు చేయాలని ఆదేశించింది. దాదాపు 400 ఆంబులెన్స్ లలో వెంటిలేటర్లు ఏర్పాటు కానున్నాయి. 
 
ప్రభుత్వం 104 వాహనాలను అడ్వాన్స్‌డ్ లైఫ్ సపోర్ట్ వాహనాలుగా మార్చనుంది. రాష్ట్రంలో కరోనా తీవ్రంగా ప్రబలుతూ ఉండటంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. కొన్ని వాహనాల్లో వెంటిలేటర్లతో పాటు గుండె సంబంధిత వ్యాధులకు చికిత్సల్లో అవసరమైన యంత్రాలను కూడా అమర్చనుంది. ఈ ఆంబులెన్స్ లలో అత్యాధునిక వైద్య సదుపాయాలు ఉండేలా ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: