భారతదేశంలో క‌రోనా పాజిటివ్ కేసుల సంఖ్య అర్ధ‌సెంచ‌రీ వైపు దూసుకుపోతోంది. ఈ రోజు ఉద‌యం కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ క‌రోనా బులెటిన్‌ను విడుద‌ల చేసింది. గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా కొత్తగా 3,900 కరోనా  కేసులు నమోదయ్యాయి.  ఇప్ప‌టివ‌ర‌కు దేశ‌వ్యాప్తంగా క‌రోనా పాజిటివ్ కేసుల సంఖ్య 46,433కు చేరింది. ఇందులో 32134 యాక్టివ్ కేసులు ఉన్నాయి. కాగా, ఒక్క రోజు వ్యవధిలో ఇంత భారీ స్థాయిలో కరోనా పాజిటివ్‌ కేసులు నమోదుకావడం ఇదే తొలిసారి. ఇప్ప‌టివ‌ర‌కు మొత్తం 12,727 మంది క‌రోనా నుంచి కోలుకుని ఆస్ప‌త్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఇక దేశ‌వ్యాప్తంగా ఇప్ప‌టివ‌ర‌కు మొత్తం 1,568 మరణాలు సంభ‌వించిన‌ట్లు కేంద్ర ఆరోగ్య‌ మంత్రిత్వ శాఖ వెల్ల‌డించింది. కాగా, గ‌త 24 గంట‌ల్లో 1074 మంది క‌రోనా బారి నుంచి కోలుకున్నార‌ని, ఒకే రోజు అత్య‌ధిక రిక‌వ‌రీలు సోమ‌వారం న‌మోదు అయ్యాయ‌ని కేంద్ర మంత్రిత్వ శాఖ వెల్ల‌డించింది.

 

ఇక మ‌హారాష్ట్ర‌లో అత్య‌ధిక క‌రోనా పాజిటివ్ కేసులు న‌మోదు అవుతున్నాయి. ఇప్ప‌టివ‌ర‌కు మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 14541కు చేరుకుంది. ఇక 583 మంది క‌రోనాతో మ‌ర‌ణించారు. నిన్న ఒక్క‌రోజే ఏకంగా 771 పాజిటివ్ కేసులు న‌మోదు అయ్యాయ‌ని అధికారులువెల్ల‌డించారు. గుజరాత్‌లో 5,804, ఢిల్లీలో 4,898, తమిళనాడులో 3,550, రాజస్తాన్‌లో 3,061, మధ్యప్రదేశ్‌లో 2,942, ఉత్తరప్రదేశ్‌లో 2,776 కరోనా కేసులు నమోదయ్యాయి. ఇదిలా ఉండ‌గా.. మాల్దీవులు, యూఏఈ నుండి భార‌త‌ పౌరులను తీసుకురావ‌డానికి భారతదేశం మూడు నౌకలను పంపింది. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: