ఏపీలో విశాఖ ఏజెన్సీ పాడేరు మండలం తుంపాడు గ్రామ సచివాలయం కుజ్జెలి పంచాయతీలో పెన్షన్లు పంపిణీ చేస్తూ గ్రామ వ‌లంటీర్‌ గబ్బాడ అనురాధ (26) గుండెపోటుతో మరణించిన విష‌యం తెలిసిందే. అయితే.. క‌రోనా సృష్టించిన విప‌త్క‌ర ప‌రిస్థితుల్లోనే విధులు నిర్విర్తించిన ఆమె కుటుంబానికి ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అండ‌గా నిలిచారు. అనురాధ కుటుంబానికి రూ. 5లక్షల పరిహారాన్ని ప్రకటించారు. ఈ సహాయం వెంటనే కుటుంబ సభ్యులకు అందేలా చూడాలని విశాఖ జిల్లా కలెక్టర్‌ను ఆదేశించిన విష‌యం విదిత‌మే. విపత్తు సమయంలో పని చేస్తున్న వ‌లంటీర్లకు ఇలాంటి పరిస్థితులు ఎదురైనప్పుడు ఆదుకోవాల్సిన అవసరం ఉందని అన్నారు.

 

అయితే.. తాజాగా.. వైసీపీ నేత‌, రాజ్య‌స‌భ స‌భ్యుడు విజ‌య‌సాయిరెడ్డి ట్విట్ట‌ర్‌లో స్పందించారు. అనురాధ‌కు నివాళి అర్పించారు. * విశాకపట్నం జిల్లాలోని తుంపాడు గ్రామంలో కోవిడ్ -19 లాక్డౌన్ సందర్భంగా వృద్ధాప్య పింఛను పంపిణీ చేస్తున్నప్పుడు గుండెపోటుతో మరణించిన మా గ్రామ వలంటీర్ అనురాధకు నివాళి. ఆమె కుటుంబ సభ్యులకు నా సంతాపం. ఆమె త్యాగం, కృషిని మనం ఎప్పటికీ మరచిపోలేం* అంటూ విజ‌య‌సాయిరెడ్డి ట్వీట్ చేశారు. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: