దేశంలో కరోనా వచ్చినప్పటి నుంచి అంటే మార్చి 24 నుంచి కరోనా కట్టడి చేయడానికి లాక్ డౌన్ విధించిన విషయం తెలిసిందే. ఆ సమయంలో అంతా ఇంటిలోనే ఉండాలని జనతా కర్ఫ్యూ విధించారు. ఆ తర్వాత లాక్ డౌన్ మొదలు పెట్టిన విషయం తెలిసిందే. మరోసారి అందరూ ఇంటిలో ఉండి రాత్రి తొమ్మిది గంటలకు దీపాలు వెలిగించాలని ప్రధాని నరేంద్ర మోదీ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. అలా దీపాలు వెలిగించి యావత్ భారత దేశం సంఘీభావం ప్రకటించారు.  మొన్నటి ఆదివారం ఆసుపత్రులపై పూలు వెదజల్లారు.  ఇలా ప్రజలను కాపాడుతున్న డాక్టర్లు, పోలీసులు, పారిశుద్ద్య కార్మికులకు ప్రజలు, నేతలు సలాం చేస్తున్నారు. 

 

అయితే ప్రభుత్వం చేస్తున్న ఈ పనులపై ఆంధ్రప్రదేశ్ సీపీఐ నేత రామకృష్ణ, తనదైన శైలిలో వ్యంగ్యోక్తులు చేశారు. లాక్ డౌన్ కారణంగా మూతబడిన మద్యం దుకాణాలను సోమవారం నాడు తిరిగి తెరవడంపై  ఆయన తదైన స్టైల్లో ప్రభుత్వాలను విమర్శించారు. తొలుత గంటలు మోగించారని, ఆపై దీపాలు వెలిగించి, అనంతరం పూలు చల్లారని, ఇప్పుడు తీర్థం ఇస్తున్నట్లుగా మద్యం అమ్మకాలు మొదలు పెట్టారని సెటైర్లు వేశారు.  మద్యం కోసం ప్రజలకు ఎక్కడా సామాజిక దూరం పాటించడం లేదని.. ఇప్పుడు కరోనా వ్యాప్తి మరింత జరిగే అవకాశం  ఉందని ఆయన అన్నారు.

 

కరోనా ఇంకా కట్టడి కాలేదని గుర్తు చేసిన ఆయన, మద్యం విక్రయాలపై కేంద్రం పునరాలోచన చేయాలని సూచించారు. ఈ మేరకు ప్రభుత్వానికి ఆయన ఓ లేఖను రాశారు. కనీసం అక్కడికి వచ్చిన వారు మాస్క్ లు ధరించకుండా కూడా వచ్చారని వ్యాఖ్యానించిన ఆయన, ఆదాయం కోసం ప్రజల ప్రాణాలను పణంగా పెడుతున్నారని ఆరోపించారు. పోలీసుల బందోబస్తు మధ్య మద్యం అమ్మకాలు సాగించాల్సిన దుస్థితి నెలకొందని అన్నారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: