ఏపీలో క‌రోనా వైర‌స్ పాజిటివ్‌ కేసులు రోజురోజుకూ పెరుగుతున్నాయి. తాజాగా ఈరోజు రాష్ట్ర ప్ర‌భుత్వం క‌రోనా హెల్త్ బులెటిన్‌ను విడుద‌ల చేసింది. గ‌త 24 గంట‌ల్లో రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 67 పాజిటిలో కేసులు న‌మోదు అయ్యాయి. కృష్ణా జిల్లాలో ఒక‌రు మృతి చెందారు. ఇప్ప‌టివ‌ర‌కు రాష్ట్ర‌వ్యాప్తంగా పాజిటివ్ కేసుల సంఖ్య 1717కు చేరుకుంది. మొత్తం మ‌ర‌ణాల సంఖ్య‌ 34కు చేరుకుంది. ఇక గ‌త 24 గంట‌ల్లో క‌ర్నూలు జిల్లాలో 25 కేసులు న‌మోదు అయ్యాయి. దీంతో జిల్లాలో మొత్తం కేసుల సంఖ్య 516కు చేరుకుంది. అలాగే.. గుంటూరులో కొత్త‌గా 13 కేసులు న‌మోదుకాగా, మొత్తం కేసుల సంఖ్య 351కి చేరుకుంది. ఇక కృష్ణా జిల్లాలో కొత్త‌గా 8 కేసులు న‌మోదుకాగా మొత్తం కేసులు 286కు చేరుకున్నాయి. విశాఖ‌లో కొత్త‌గా 2 కేసులు న‌మోదుకాగా మొత్తం కేసుల సంఖ్య 37కు చేరుకుంది.

 

 అనంత‌పురంలో కొత్త‌గా న‌మోదు అయిన రెండు కేసుల‌తో క‌లిపి మొత్తం 80కు చేరుకుంది సంఖ్య‌. క‌డ‌ప‌లో 2 కేసులతో క‌లిపి మొత్తం 89 కేసులు న‌మోదు అయ్యాయి. ఇప్ప‌టివ‌ర‌కు చిత్తూరులో 82, తూర్పుగోదావ‌రిలో 45, నెల్లూరులో 92, ప్ర‌కాశంలో 61, శ్రీ‌కాకుళంలో 5, ప‌శ్చిమ‌గోదావ‌రిలో 59 కేసులు న‌మోదు అయ్యాయి. క‌రోనా నుంచి కోలుకుని ఇప్ప‌టివ‌ర‌కు 589 మంది ఆస్ప‌త్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ప్ర‌స్తుతం 1094 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇదిలా ఉండ‌గా.. ఏపీలో వేగవంతంగా క‌రోనా నిర్ధార‌ణ ప‌రీక్ష‌లు కొన‌సాగుతున్నాయి. ఇప్ప‌టివ‌ర‌కు మొత్తం 133492 క‌రోనా నిర్ధార‌ణ ప‌రీక్ష‌లు నిర్వ‌హించారు. ప‌దిల‌క్ష‌ల జ‌నాభాకు ఏపీలో 2345 క‌రోనా ప‌రీక్ష‌లు జ‌రుగుతున్నాయి. 

మరింత సమాచారం తెలుసుకోండి: