లాక్‌డౌన్ కార‌ణంగా సెల‌బ్రెటీలంతా ఇళ్ల‌కే ప‌రిమితం అయ్యారు. త‌మ వ్య‌క్తిగ‌త‌, వృత్తిగ‌త విష‌యాల‌ను సోష‌ల్ మీడియాలో పంచుకుంటున్నారు. క‌రోనా కార‌ణంగా  బాలీవుడ్ భామ‌‌ ప్రియాంక చోప్రా ఆమె భర్త నిక్‌ జోనస్‌ జంట అమెరికాలోని లాస్‌ఎంజిల్స్‌లో ఇంటికే పరిమితమైన విషయం తెలిసిందే. తాజా గా ప్రియాంక తన ఇన్‌స్టాగ్రామ్‌లో మూడు  ఫోటోలను పోస్ట్‌ చేశారు. ‘ఈ ఏడాదిలో మే మొదటి సోమవారం రోజున సృజనాత్మకంగా చిన్నారి కోడలు కృష్ణ త యారు చేసిన అందమైన యువరాణి’ అని ఓ ఫొటోకి కామెంట్‌ జత చేశారు ప్రియాంక.  

 

ఈ ఫొటోలో ప్రియాంక కోడలు కృష్ణ.. తనకు చిన్ని కిరిటాన్ని తొడిగినట్లు కనిపిస్తోంది. మరో ఫొటోలో కృష్ణ తన చిన్ని చేతులతో ప్రియాంక ఐ షాడోకు మేకప్‌ వేస్తుంది. ఇక మేకప్‌ అయిపోయిన అనంతరం తీసిన ఫొటోలో.. ప్రియాంక లిప్‌ స్టిక్‌ పెదవికి కిందికి జారుతున్నట్లు కనిపిస్తుంది. ప్రస్తుతం ఈ ఫొటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి. అంతకు ముందు ప్రియాంక తన కోడలితో  సరదాగా జిమ్‌ చేసిన వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకున్న విషయం తెలిసిందే. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: