జ‌గ‌న్ స‌ర్కార్‌కు ఊహించ‌ని షాక్ త‌గిలింది. లాక్ డౌన్ నిబంధ ‌న‌ల‌ను ఉల్లంఘించి, రాష్ట్రంలో క‌రోనా వైర‌స్ వ్యాప్తికి అధికార పార్టీ నేత‌లే కార‌ణం అంటూ దాఖ‌లైన పిటిష‌న్‌పై ఏపీ హైకోర్టు ఇవాళ‌ విచార‌ణ చేప‌ట్టింది. ఈమేర‌కు న్యాయ‌వాది ఇంద్ర‌నీల్  వీడియో కాన్ఫ‌రెన్స్ ద్వారా త‌న వాద‌న‌లు వినిపించారు.  ఈ సంద‌ర్భంగా  లాక్ డౌన్ నిబంధ‌న‌ల‌ను ఉల్లంఘించిన ఎమ్మెల్యేలు రోజా, వెంక‌ట్ గౌడ్‌, విడుద‌ల ర‌జ‌ని, మ‌ధుసూద‌న్ రెడ్డి , సంజీవ‌య్య‌ల‌కు హైకోర్టు నోటీసులు జారీ చేసింది. 

 

అంతేగాక నిబంధ‌న‌లు ఉల్లంఘించిన వారిపై ఏం చ‌ర్య‌లు తీసుకున్నారో వారం రోజుల్లో కౌంట‌ర్ దాఖ‌లు చేయాల‌ని ఏపీ ప్ర‌భుత్వం, డీజీపీల‌కు హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఇదిలా ఉంటే మ‌రోప‌క్క పంచాయ‌తీ కార్యాల‌యాల‌పై రంగుల విష‌యంలో ఏపీ ప్ర‌భుత్వం జారీ చేసిన జీవోను కూడా హైకోర్టు స‌స్పెండ్ చేసింది. ఈ రెండు ఘ‌ట‌న‌లు ఒక్క రోజే జ‌ర‌గ‌డం పార్టీలో క‌ల‌క‌లం రేపుతోంది. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: