లాక్ డౌన్ కారణంగా పేద ప్రజలు ఇబ్బందు లు ఎదుర్కొంటున్నారు. వారిని ఆదుకోవడానికి సినీ పరిశ్రమ ముందుకొచ్చింది. ఆ విధంగా పలువురు ప్రముఖులు చాలావరకు తమ చేతనైన సాయాన్ని అందించారు.  ఐతే సహాయం చేయడం ద్వారా వారు సోషల్ మీడియాలో ప్రశంసలు అందుకుంటున్నారు. కానీ కొన్ని మీడియా వాళ్ళు మాత్రం వారి గురించి తప్పుడు రాతలు రాస్తున్నారు. అయితే వారికి  హీరో విజయ్ దేవరకొండ స్ట్రాంగ్ గానే కౌంటర్ ఇచ్చాడు. లాక్ డౌన్ లో ఇబ్బంది పడేవారికి తమ వంతు చాతనైన సహాయం చేశామని. అందులో ఎవరైతే బాగా కష్టాల్లో ఉన్నారో వారిని ఎంచుకొని వారికీ సహాయం చేసే ప్రయత్నం చేశామని..దీనిగురించి వక్రీకరించి రాసిన సదరు వెబ్ సైట్ రైటర్ కు సంధానం ఇచ్చాడు..

IHG

 

తాము ఎందుకు ఆ ఓ వెబ్ సైట్ ను లాంచ్ చేసామో ఆ వీడియోలో వివరించాడు ..వీలైతే సహాయం చేయండి తప్ప ఇలాంటి పిచ్చి రాతలు రాయవద్దని హితవు పలికారు..అయితే ప్రస్తుతం విజయ్ మాట్లాడిన ఆ వీడియో తెగ ట్రేండింగ్ అవుతోంది..
దీనికి  పలువురు సినీ ప్రముఖులు తమ సంఘీభావాన్ని తెలిపారు.. ఈ సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి స్వయంగా తన ట్విట్టర్ ఖాతా ద్వారా స్పందించారు..ఆ సందేశం ఏంటంటే ..' డియర్ విజయ్
@TheDeverakonda మీ ఆవేదన నేను అర్ధం చేసుకోగలను..బాధ్యతలేని రాతల వల్ల,మీలా నేను నా కుటుంబం బాధపడిన సందర్భాలు చాలా ఉన్నాయి..మేము మీకు అండగా నిలుస్తాము..మంచి చేయటానికి మీ ఆత్మను అరికట్టడానికి ఏమీ చేయవద్దు...వ్యక్తిగత అభిప్రాయాలను వార్తగా భావించవద్దని జర్నో స్నేహితులను వినయంగా అభ్యర్థించండి...#KillFakeNews' ...

మరింత సమాచారం తెలుసుకోండి: