కేంద్రానికి ఏపీ మాజీ ఎస్ఈసీ నిమ్మ‌గ‌డ్డ ర‌మేశ్‌కుమార్ రాసిన లేఖపై సీఐడీకి ఫోరెన్సిక్ నివేదిక అందింది. ల్యాప్‌టాప్‌, డెస్క్‌టాప్‌ల‌ను ప‌రిశీలించి నివేదిక ఇచ్చినట్లు ఫోరెన్సిక్ అధికారులు తెలిపారు. అయితే..‌ నిమ్మ‌గ‌డ్డ రాసిన‌ట్టు చెబుతున్న ఆ లేఖ‌ ఎస్ఈసీ కార్యాల‌యంలో త‌యారు కాలేద‌ని ఫోరెన్సిన్ నివేదిక తేల్చింది. ఈ సంద‌ర్భంగా సీఐడీ ఏడీజీ సునీల్ కీల‌క విష‌యాల‌ను వెల్ల‌డించారు. విచార‌ణ‌లో  నిమ్మ‌గ‌డ్డ పీఏ సాంబ‌మూర్తి అన్నీ అస‌త్యాలే చెప్పార‌ని ఆయ‌న పేర్కొన్నారు. గ‌త నెల 18న ఉద‌యం పెన్‌డ్రైవ్‌లో లేఖ వ‌చ్చింద‌ని ఆయ‌న స్స‌ష్టం చేశారు. అయితే.. ఆ లేఖ ఎక్క‌డి నుంచి వ‌చ్చిందో త్వ‌ర‌లోనే తెలుస్తామ‌ని తెలిపారు. లేఖ ముందే త‌యారై బ‌య‌ట నుంచే వ‌చ్చింద‌ని సీఐడీ ఏడీజీ సునీల్ పేర్కొన్నారు.

 

ఇదిలా ఉండ‌గా.. నిమ్మ‌గ‌డ్డ లేఖ వ్య‌వ‌హారంలోకి సీఐడీ ఎంట్రీ ఇచ్చిన త‌ర్వాత కేసు వేగ‌వంతంగా ముందుకు సాగుతోంది. మొన్న‌టి రాత్రి నుంచి నిమ్మ‌గ‌డ్డ పీఏ సాంబ‌మూర్తిని హైద‌రాబాద్‌లోని సీఐడీ కార్యాల‌యంలో విచారించిన విష‌యం తెలిసిందే. ఈ విచార‌ణ‌లో సాంబ‌మూర్తి అన్నీ అబ‌ద్ధాలే చెప్పిన‌ట్లు అధికారులు చెబుతున్నారు. అయితే..ఇక్క‌డ మ‌రొక విష‌యం ఏమిటంటే.. నిన్న హైకోర్టులో కూడా ఇదే కేసుపై విచార‌ణ జ‌రిగింది. ఈరోజు కూడా విచార‌ణ జ‌రుగుతున్న నేప‌థ్యంలో ఏం జ‌రుగుతుందోన‌ని అంద‌రూ ఉత్కంఠ‌గా ఎదురుచూస్తున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: