తెలంగాణ రాష్ట్రంలో కేబినెట్ భేటీ మరికాసేపట్లో ప్రారంభం కానుంది. లాక్ డౌన్ పొడిగింపు, మద్యం అమ్మకాలు, అనేక అంశాలపై కేబినెట్ చర్చించనుంది. హైదరాబాద్, రంగారెడ్డి, వికారాబాద్, మేడ్చల్ జిల్లాల్లో లాక్ డౌన్ ను ప్రభుత్వం మరింత కఠినం చేయనుందని సమాచారం. రాష్ట్రంలో ఈ నెలాఖరు వరకు లాక్ డౌన్ కొనసాగే అవకాశం ఉందని తెలుస్తోంది. మద్యం అమ్మకాలకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇవ్వనుందని తెలుస్తోంది. 
 
ఈ నెల 28వరకు లాక్ డౌన్ ను పొడిగించే అవకాశం ఉందని సమాచారం. మంత్రులతో చర్చించి కేసీఆర్ తుది నిర్ణయాలను ప్రకటిస్తారని సమాచారం. ఇతర రాష్ట్రాలలో మద్యం అమ్మకాలకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో తప్పనిసరి పరిస్థితుల్లో సీఎం కేసీఆర్ మద్యం అమ్మకాలకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వనున్నారని సమాచారం. తెలంగాణలో మద్యం ధరలను పెంచే అవకాశాలు ఉన్నాయని సమాచారం. వలస కార్మికుల గురించి కూడా కేబినెట్ భేటీలో చర్చ జరగనుందని తెలుస్తోంది. పదవ తరగతి పరీక్షల గురించి కూడా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకోనుందని తెలుస్తోంది. 
 
 

మరింత సమాచారం తెలుసుకోండి: