బీజేపీ రాజ్యసభ సభ్యుడు సీఎం రమేశ్‌కు కేంద్ర ప్ర‌భుత్వం కీలక ప‌ద‌విని అప్పగించింది. పార్లమెంట్‌లో అత్యంత కీలకమైన వాటిలో పీఏసీ (పబ్లిక్ అకౌంట్స్ కమిటీ)లో సభ్యుడిగా రాజ్యసభ తరఫున సీఎం రమేశ్‌ను తీసుకున్నారు. 2020-21 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ఈ కమిటీలో రమేశ్‌కు చోటు దక్కింది. ఈ మేరకు పబ్లిక్ అకౌంట్స్ కమిటీ విభాగం ఓ ప్రకటన విడుద‌ల చేసింది. ఇక పీఏసీ చైర్ పర్సన్‌గా‌ కాంగ్రెస్ లోక్‌సభ పక్ష నేత ఆధిర్ రంజన్ చౌదరి నియమితులయ్యారు. కాగా, మొన్న‌నే వైసీపీ ఎంపీ బాలశౌరిని లోక్‌సభ తరఫున సభ్యుడిగా తీసుకున్న విష‌యం తెలిసిందే. ఈ మేరకు లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా కార్యాలయం ప్రకటించారు.

 

లోక్‌సభలో బీజేపీ, కాంగ్రెస్, డీఎంకే తర్వాత వైసీపీకే ఎక్కువ మంది ఎంపీలు ఉన్న విష‌యం తెలిసిందే. ఈ నేప‌థ్యంలోనే బాలశౌరికి చోటు దక్కింది. కాగా.. లోక్‌సభ నుంచి మొత్తం 15 మందిని, రాజ్యసభ నుంచి ఏడు మందిని ఈ కమిటీలో సభ్యులుగా తీసుకున్నారు. ఈ మేరకు మొత్తం 22 మందిని తీసుకున్న కేంద్రం.. ఇంకా ఇద్దరు రాజ్యసభ నుంచి ఇద్దర్ని తీసుకోవాల్సి ఉంది. ఆ ఇద్దరి పేర్లను కేంద్రం ఇంకా పెండింగ్‌లో పెట్టింది. ఆ అవ‌కాశం ఎవ‌రికి ద‌క్కుతుంద‌న్న దానిపై అంద‌రూ ఉత్కంఠ‌గా ఎదురుచూస్తున్నారు. 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: