లాక్‌డౌన్ వేళ ఛ‌త్తీస్‌గ‌ఢ్‌ ప్రభుత్వం  సంచలన నిర్ణయం తీసుకుంది. ఇక అక్కడ ఇళ్ళకే మద్యం సరఫరా కానుంది. ఇందుకు సంబంధించి త్వరలో ఉత్తర్వులు వెలువడనున్నాయి. మొత్తంమీద లాక్‌డౌన్ నేపధ్యంలో... మందబాబులు, మద్యం ప్రియులకు పెద్దగా కష్టం లేకుండా... ఇంటికే మద్యాన్ని అందించాలన్న నిర్ణయాన్ని ఆయా వర్గాలు స్వాగతిస్తున్నాయి. అయితే మహిళలు మాత్రం ఈ నిర్ణయాన్ని నిరసిస్తున్నారు.  

 

ఇళ్ళ వద్దకే మద్యం సరఫరా  చేసేందుకోసం రాష్ట్ర ప్రభుత్వం ఓ ఆన్‌లైన్ పోర్టల్‌‌ను ప్రారంభించింది. మద్యం కావాల్సిన వారు... తమకు కావాల్సిన బ్రాండ్ మధ్యం ఆర్డర్ తో పాటు, డబ్బును కూడా ఆన్‌లైన్ లోనే చెల్లించాల్సి ఉంటుంది.  ఒక వ్యక్తికి 5000 మిల్లీ లీటర్ల ( 5 లీటర్ల) మద్యం కొనుగోలుకు అవకాశముంటుంది. రూ.120 డెలివరీ ఛార్జీ కింద వసూలు చేయ‌నున్నారు. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: