భార‌త్‌లో క‌రోనా వైర‌స్ విజృంభిస్తోంది. గ‌త రెండు మూడు రోజులుగా క‌రోనా వైర‌స్ కేసులు రోజువారీగా మూడువేల‌కుపైగానే న‌మోదు అవుతున్నాయి. తాజాగా.. కేంద్ర ప్ర‌భుత్వం క‌రోనా హెల్త్ బులెటిన్ విడుద‌ల చేసింది. గ‌త 24 గంట‌ల్లో 3900 క‌రోనా పాజిటివ్ కేసులు న‌మోదు కాగా 195 మర‌ణాలు సంభ‌వించిన‌ట్లు కేంద్ర ఆరోగ్య శాఖ సంయుక్త కార్య‌ద‌ర్శి ల‌వ్ అగ‌ర్వాల్ వెల్ల‌డించారు. దీంతో దేశ‌వ్యాప్తంగా క‌రోనా పాజిటివ్ కేసుల సంఖ్య 46433కు చేరుకుంద‌ని, మ‌ర‌ణాల సంఖ్య 1568కు చేరుంద‌ని అధికార‌వ‌ర్గాలు వెల్ల‌డించాయి.

 

గ‌త 24 గంట‌ల్లో 1020 మంది డిశ్చార్జ్ అయ్యార‌ని పేర్కొన్నాయి. దీంతో ఇప్పటివరకు సుమారు 12,727 మంది క‌రోనా నుంచి కోలుకుని ఆస్ప‌త్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యార‌ని తెలిపారు. ఇక భార‌త్‌లో రిక‌వ‌రీ రేట్ 27.4శాతానికి పెరిగింద‌ని ఆయ‌న వెల్ల‌డించాయి. ఇక 32138 యాక్టివ్ కేసులు ఉన్నాయ‌ని తెలిపాయి. కాగా, దేశ‌వ్యాప్తంగా న‌మోదు అవుతున్న మొత్తం కేసుల్లో ప‌ది న‌గ‌రాల నుంచే 60శాతం కేసులు ఉంటున్నాయ‌ని అధికార‌వ‌ర్గాలు వెల్ల‌డించాయి. కేసుల సంఖ్య అమాంతంగా పెరుగుతుండ‌డంపై ప్ర‌జ‌ల్లో ఆందోళ‌న వ్య‌క్త‌మ‌వుతోంది. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: