దేశంలో లాక్ డౌన్ మొదలైనప్పటి నుంచి మందు బాబులకు కళరాత్రి మిగిలింది.  ప్రతిరోజూ సాయంత్రం హాయిగా ఇంత మద్యం పుచ్చుకొని ముక్క నొట వేసుకొని ఇదే జిందగీ అనుకునేవారు.. ఉన్నట్టుండి లాక్ డౌన్ తో మద్యం షాపులు మూసి వేయడంతో పిచ్చెక్కిపోయారు.  కొంత మంది ఉన్మాదులుగా మారారు.. మరికొంత మంది మద్యం ఎలా తయారు చేసుకోవాలా అనే ప్రయోగాలు కూడా చేశారు. ఇక దొంగ చాటు మద్యం దొరికినా ఆ రేట్లు పెట్టికొనలేక నానా అగచాట్లు పడ్డారు.  మొత్తానికి నిన్నటి నుంచి మందు బాబులు పండుగ చేసుకునే సుదినం వచ్చింది.  వివిధ రాష్ట్రాల్లో మద్యం షాపులు ఓపెన్ చేశారు.  కొన్ని కండీషన్ల మేరకు నిన్నటి నుంచి మద్యం షాపులు ఓపెన్ చేయడంతో మందుబాబులు ఎగబడి కొన్నారు.

 

బెంగళూరులో మహిళలు ప్రత్యేకంగా పెద్ద క్యూలో నిలబడి వెయిట్ చేస్తున్న ఫొటో సోషల్ మీడియాను షేక్ చేసింది.   ఏపీలో రూ. 60 కోట్ల అమ్మకాలు జరిగాయి. తాజాగా  ఇక ఉత్తరప్రదేశ్ లో అయితే కళ్లు చెదిరే రీతిలో వ్యాపారం జరిగింది. ఏకంగా రూ. 100 కోట్ల పైగా అమ్మకాలు జరిగాయని ఆ రాష్ట్ర ఎక్సైజ్ డిపార్ట్ మెంట్ అధికారులు తెలిపారు. అంటే దేశం మొత్తం ఏ రేంజ్ లో మద్యం అమ్మం జరిగి ఉండొచ్చు.. అయితే రాజధాని లక్నోలో 4 గంటల సేల్స్ తగ్గినా ఏకంగా రూ. 6.3 కోట్ల వ్యాపారం జరిగింది.  

మరింత సమాచారం తెలుసుకోండి: