IHG

టాలీవుడ్ ..కోలీవుడ్ ..బాలీవుడ్  మరియు హాలీవుడ్ ఇలా ఏ వుడ్ అయినా సరే రూమర్లు తప్పవు , అది నటులైన సరే క్రీడాకారులు అయినా సరే వారు రూమర్ల నుండి తప్పించుకోలేరు. అప్పట్లో టెన్నీస్ ప్లేయర్ సానియా మిర్జా కి షోయబ్ మాలిక్ కి మధ్య ఏదో ఉంది అంటూ పుకార్లు గుప్పుమన్నాయి . షోయబ్ మాలిక్ సానియా ఇద్దరు పెళ్లి చేసుకోబోతున్నారని అప్పట్లో రూమర్లు తెగ చెక్కర్లు కొట్టాయి అయితే ఆ రూమర్లకు చెక్ పెడుతూ వారిద్దరు పెళ్లి చేసుకొని సెటిల్ అయ్యారు. అయితే తాజాగా ఇలాంటి గాసిప్ ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది .

IHG

మిల్కీ బ్యూటీ తమన్నా మరియు పాకిస్తాన్ క్రికెటర్ అబ్దుల్ ర‌జాక్‌ తో ప్రేమలో ఉందని పుకార్లు గుప్పుమన్నాయి. అయితే అందులో కాబోయే భార్యకు రజాక్ దగ్గరుండి మరీ నగలు షాపింగ్ చేస్తున్నాడని పుకార్లు షికార్లు కొట్టాయి. అయితే మిల్కీ బ్యూటీ తమన్నా ఈ పుకార్లను కొట్టిపడేసింది. ఆమధ్య సినిమా స్టార్ తో అన్నారు..ఆ తరువాత బిజినెస్ మ్యాన్ తో అన్నారు మొన్ననే ఓ డాక్టర్ తో అన్నారు ఇలా ఎంత మందితో పుకార్లు పుట్టిస్తారు.. మీకు పని పాటా లేదా..ఎప్పుడు పక్కవారి జీవితాలతో ఆట్లాడుకుంటారా..అంటూ మిల్కీ ఫైర్ అయ్యింది..అయితే అసలు విషయం ఏమిటంటే ఆ ఫోటో దుబాయ్ లోని ఓ నగల షాప్ ఓపెనింగ్ చేయడానికి వెళ్ళినప్పుడు జరిగిన ఫోటో షూట్ అంటూ మిల్కీ చెప్పుకొచ్చింది

మరింత సమాచారం తెలుసుకోండి: