దేశంలో కరోనా వైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో లాక్ డౌన్ ప్రకటించారు. దాంతో ఇతర దేశాలకు, రాష్ట్రాలకు వేరే వేరు ప్రదేశాలకు వెళ్లిన వారు అక్కడే  చిక్కుకున్న విషయం తెలిసిందే.  ఈ నేపథ్యంలో లాక్ డౌన్ కారణంగా షెల్టర్ హోంలో చిక్కుకుపోయిన రిటైర్డ్ ఎస్సైని గుర్తుతెలియని వ్యక్తులు గ్యాంగ్ రేప్ చేశారు.   ఈ దారుణ ఘటన  పంజాబ్‌లోని ఫిరోజ్‌పూర్‌లో జరిగింది.  ప్రస్తుతం క్వారంటైన్ లో ఉన్న మహిళలకు భద్రత లేదన్నదానికి ఇదో ఉదాహారణ అంటున్నారు. ఇలాంటి ఘటనలు తరుచూ జరుగుతున్నాయి.  కామాంధులు ఒంటరిగా కనిపించిన మహిళల్ని అత్యాచారాలు చేస్తున్నారు. 

 

రైల్వే పోలీస్ విభాగంలో ఎస్సైగా పనిచేసి రిటైరైన మహిళా అధికారి(50) జమ్మూలోని వైష్ణోదేవి ఆలయాన్ని సందర్శించేందుకు బయలుదేరారు.  అదే సమయంలో లాక్ డౌన్ ప్రకటించడంతో అక్కడే చిక్కుకు పోయారు. స్థానిక జీఆర్పీ పోలీసుల సాయంతో షెల్టర్ హోంలో ఆశ్రయం పొందుతున్నారు. ఈ క్రమంలో ఆమె ఒంటరిగా ఉన్న సమయంలో ఇద్దరు వ్యక్తులు ఆమెపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు.  అయితే ఈ అత్యాచారం 1వ తారీకే జరిగినా.. ఆలస్యంగా వెలుగు లోకి వచ్చింది. ఈ ఘటనపై బాధితురాలు ఫిరోజ్‌పూర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: