దేశాన్ని పట్టి పీడిస్తున్న కరోనా మహమ్మారి ఇప్పటి వరకు మనుషులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి.  తాజాగా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మీడియాతో లాక్ డౌన్ విషయం పై మాట్లాడారు.   ఇప్పటి వరకూ తెలంగాణలో 1096 కరోనా పాజిటవ్ కేసులు నమోదు అయినట్లు ఆయన తెలిపారు. మొత్తం 628 మంది డిశ్చార్జి అయ్యారని.. మంగళవారం 43 మంది పేషెంట్లు డిశ్చార్జి అయ్యారన్నారు. మంగళవారం 11 మందికి పాజిటివ్ నిర్ధారణ అయినట్లు కేసీఆర్ స్పష్టం చేశారు. ఇక డేంజర్ జోన్ లో హైదరాబాద్ పరిసర ప్రాంతాలు ఉన్నాయి. కేంద్రం సడలింపులు పాటించాల్సిందే.  ఆరెంజ్ జోన్లో లోని ఐదారు జిల్లాలు గ్రీన్ జోన్ లోకి వస్తున్నాయి.  రెడ్ జోన్ లో నే  66 శాతం కేసులు ఉన్నాయి. 

 

కొత్త కేసులన్నీ జీహెచ్ ఎంసీలోనే ఉన్నాయి.  సర్వే చేయించాం.. చాలా వరకు లాక్ డౌన్ పొడిగిస్తేనే బాగుంటుందని అన్నారు. మనం ఆరోగ్యంగా బతికి ఉండాలి.. అందుకు ఇప్పుడు కష్టపడ్డా నష్టం లేదు అన్నారు.  ఇక హైదరాబాద్ లో ఎక్కువ కేసులు నమోదు అవుతున్నాయి.. మరణాలు కూడా ఇక్కడే ఎక్కువ నమోదు అయ్యాయి. హైదారాబాద్ సల్లగుండాలి... ఇక్కడ ప్రజలు లాక్ డౌన్ జాగ్రత్తగా పాటించాలి అన్నారు.  ప్రపంచ దేశాలన్నీ ఇప్పుడు హైదరాబాద్ వైపు చూస్తున్నాయి.. అతి వేంగా అభివృద్ది చెందుతుంది.. అందుకు ఇక్కడి ప్రజలు నగరాన్ని కాపాడాల్సిన బాధ్యత ఉందని అన్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: