మొద‌టి నుంచీ అప్ర‌మ‌త్తంగా ఉంటూ క‌ట్టుదిట్ట‌మైన చ‌ర్య‌లు తీసుకోవ‌డం వ‌ల్ల క‌రోనా వైర‌స్ వ్యాప్తిని తెలంగాణ‌లో క‌ట్ట‌డి చేయ‌గ‌లిగామ‌ని ముఖ్య‌మంత్రి కేసీఆర్ అన్నారు.  ఈ దేశంలో మొద‌టిసారి కంటైన్మెంట్ జోన్‌ను ప్రాంరంభించింది తెలంగాణ‌లోని క‌రీంన‌గ‌ర్‌లోనేన‌ని, ఆ త‌ర్వాత అంద‌రూ దానిని పాటించార‌ని ఆయ‌న అన్నారు. 

 

మ‌ధ్యాహ్నం నుంచి సుదీర్ఘంగా జ‌రిగిన మంత్రివ‌ర్గం స‌మావేశం అనంత‌రం ఏర్పాటు చేసిన విలేక‌రుల స‌మావేశంలో ముఖ్య‌మంత్రి కేసీఆర్ మాట్లాడారు. అనేక చ‌ర్య‌ల ఫ‌లితంగా తెలంగాణ‌లో వైర‌స్ అదుపులోకి వ‌చ్చింద‌ని, మ‌రికొన్ని రోజుల్లో అప్ర‌మ‌త్తంగా ఉంటే.. ఇక మ‌నం వైర‌స్ బారి నుంచి బ‌య‌ట‌ప‌డిన‌ట్టేన‌ని కేసీఆర్ పేర్కొన్నారు.

 

లాక్‌డౌన్‌ను క‌ఠినంగా అమ‌లు చేయ‌డం వ‌ల్లే తెలంగాణ‌లో క‌రోనా పాజిటివ్ కేసులు త‌గ్గుముఖం ప‌ట్టాయ‌ని ఆయ‌న వివ‌రించారు. అయినా మ‌నం మ‌రింత అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని, అప్పుడే మ‌నం ఈ మ‌హ‌మ్మారి నుంచి పూర్తి స్థాయిలో బ‌య‌ట‌ప‌డుతామ‌ని కేసీఆర్ పేర్కొన్నారు. ప్ర‌జ‌లు కూడా ఇందుకు స‌హ‌క‌రించాల‌ని ముఖ్య‌మంత్రి కేసీఆర్ కోరారు. మ‌న చేతిలో ఉన్న ఏకైన ఆయుధం లాక్‌డౌనేన‌ని, మ‌నందరం పాటించాల‌ని ప్ర‌జ‌ల‌కు విజ్ఞ‌ప్తి చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: