సీఎం కేసీఆర్ మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. మే నెల 29వ తేదీ వరకు రాష్ట్రంలో లాక్ డౌన్ పొడిగించనున్నట్టు ప్రకటన చేశారు. కేంద్రం మే 17 వరకు లాక్ డౌన్ ను పొడిగించగా సీఎం కేసీఆర్ మరో 12 రోజులు అధికంగా లాక్ డౌన్ ను పొడిగించటం గమనార్హం. సీఎం కేసీఆర్ మరికొన్ని రోజులు ఓపిక పడితే రాష్ట్రంలో కరోనాను పూర్తిస్థాయిలో కట్టడి చేయగలమని అన్నారు. కేంద్రం నిబంధనలను రాష్ట్రం అమలు చేస్తుందని అన్నారు. 
 
కేంద్రం నిబంధనలతో పోలిస్తే రాష్ట్రంలో మరింత కఠినంగా లాక్ డౌన్ నిబంధనలు అమలవుతాయని అన్నారు. రెడ్ జోన్లలో షాపులు ఓపెన్ చేయటానికి అనుమతులు ఇచ్చే ప్రసక్తి లేదని అన్నారు. గృహ నిర్మాణాలు, నిత్యావసర వస్తువులు, సిమెంట్, స్టీల్ షాపులకు మాత్రమే అనుమతిస్తామని పేర్కొన్నారు. వ్యవసాయ సంబంధ దుకాణాలకు కూడా మినహాయింపులు ఇస్తున్నట్టు పేర్కొన్నారు, 

మరింత సమాచారం తెలుసుకోండి: