భార‌త‌ దేశంలో కరోనా వైర‌స్ ప్ర‌భావం తీవ్ర‌రూపం దాల్చుతోంది. గత 24 గంటల్లో కొత్తగా 1694 కేసులు నమోదవగా, 126 మంది మరణించారు. ఇప్ప‌టివ‌ర‌కు కొవిడ్‌-19 పాజిటివ్‌ కేసుల సంఖ్య 49,391కి చేరింది. వైరస్‌ ప్రభావంతో ఇప్పటివరకు 1694 మంది మరణించారు. కరోనా బారిన పడిన వారిలో 14,182 మంది బాధితులు కోలుకున్నారు. ఇక‌ దేశవ్యాప్తంగా మరో 33,514 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. దేశంలో కోలుకుంటున్న వారు 28.71 శాతంగా ఉన్నార‌ని కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ ప్రకటించింది. దేశంలో అత్యధిక కరోనా కేసులు మహారాష్ట్రలో నమోదయ్యాయి. రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 15,525కు చేసింది.

 

తర్వాతి స్థానంలో ఉన్న గుజరాత్‌లో 6245 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. 5104 కరోనా పాజిటివ్‌ కేసులతో ఢిల్లీలో మూడో స్థానంలో ఉన్నది. ఆ త‌ర్వాత త‌మిళ‌నాడు, రాజ‌స్థాన్‌, మ‌ధ్య‌ప్ర‌దేశ్, ఆంధ్ర‌ప్ర‌దేశ్ త‌దిత‌ర రాష్ట్రాలు ఉన్నాయి. ఇక కేంద్ర ప్ర‌భుత్వం ఇచ్చిన లాక్‌డౌన్ స‌డ‌లింపుల‌తో ప‌లు రాష్ట్రాల్లో మ‌ద్యం షాపులు తెరుచుకున్నాయి. భౌతిక‌దూరం పాటించ‌కుండా మందుబాబులు పెద్ద‌సంఖ్య‌లో బారులుతీరుతుండ‌డంతో ప్ర‌జ‌ల్లో ఆందోళ‌న వ్య‌క్త‌మ‌వుతోంది.

 

మరింత సమాచారం తెలుసుకోండి: