కరోనా వైర‌స్‌ ప్రపంచ దేశాలను కుదిపేస్తోంది. ఈ మహమ్మారి కార‌ణంగా రోజుకు వేల‌మంది మ‌ర‌ణిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటివరకు 37,27,894 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. కరోనా బారిన పబడిన 2,58,342 మంది మరణించగా, 12,42,407 లక్షల మంది కోలుకున్నారు. ఇక‌ 22,27,145 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. అమెరికాలో గత 24 గంటల్లో 2333 మంది మరణించారు. మొత్తంగా దేశంలో కరోనా మృతుల సంఖ్య 72,271కి చేరింది. అమెరికాలో ఇప్పటివరకు 12,37,633 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. ఇక స్పెయిన్‌లో కేసుల సంఖ్య 2,50,561కి చేరింది. దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 25,613 మంది బాధితులు మరణించారు.

 

ఇటలీలో 2,13,013 కేసులు నమోదుకాగా, 29,315 మంది మర‌ణించారు. అలాగే యూకేలో 1,94,990 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదుకాగా ఇప్ప‌టివ‌ర‌కు 29,427 మంది మృతి చెందారు. ఫ్రాన్స్‌లో కరోనా కేసుల సంఖ్య 1,70,551కి చేరింది. మొత్తం 25,531 మంది మృతిచెందారు. అదేవిధంగా జర్మనీలో ఇప్పటివరకు 1,67,007 పాజిటివ్‌ కేసులు నమోదవగా, 6,993 మంది మరణించారు. రష్యాలో కరోనా కేసుల సంఖ్య వేగంగా పెరుగుతున్నది. దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 1,55,370 పాజిటివ్‌ కేసులు నమోదవగా, 1451 మంది మృతి చెందిన‌ట్లు తాజా గ‌ణాంకాలు చెబుతున్నాయి. 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: