దేశంలో నలభై రోజుల పాటు లాక్ డౌన్ కొనసాగిన నేపథ్యంలో ఎక్కడి వారు అక్కడే చిక్కుకు పోయారు.  కోట్ల మంది వలస కార్మికులు తమ స్వస్థలాలకు చేరేందుకు నానా కష్టాలు పడ్డారు.  కొంత మంది కాలినడకన బయలు దేరిన విషయం తెలిసిందే.  వారు పడుతున్న కష్టాలు పరిగణలోకి తీసుకొని వలస కార్మికులు తమ స్వస్థలాలకు వెళ్లేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.  అందుకోసం ప్రత్యేక రైళ్లు, బస్సులు కూడా ఏర్పాటు చేసింది. ఈ నేపథ్యంలో వ‌ల‌స కూలీల‌ను స్వ‌స్థ‌లాల‌కు పంపేందుకు శ్రామిక్ రైళ్ల‌ను ఏర్పాటు చేసిన విష‌యం తెలిసిందే.  ఇవాళ బ‌య‌లుదేరాల్సిన రైళ్ల‌ను క‌ర్నాట‌క ప్ర‌భుత్వం ర‌ద్దు చేసింది. రాష్ట్రంలో భ‌వ‌న నిర్మాణ ప‌నుల‌కు ప్ర‌భుత్వం అనుమ‌తి ఇచ్చింది.  ఈ నేప‌థ్యంలో వ‌ల‌స కార్మికుల ప్ర‌యాణం అవ‌స‌రంలేద‌ని, వారికి ప‌ని క‌ల్పిస్తామ‌ని సీఎం య‌డ్యూరప్ప తెలిపారు.

 

అయితే ఇతర రాష్ట్రాలతో పోల్చితే అక్కడ కాస్త మెరుగు పడ్డట్టే అందుకోసం రెడ్ జోన్లు మిన‌హాయిస్తే.. మిగితా ప్రాంతాల్లో నిర్మాణ ప‌నులు చేసుకోవ‌చ్చు అని సీఎం తెలిపారు.ఈ నేప‌థ్యంలో రైళ్ల‌ను ర‌ద్దు చేయాల‌ని క‌ర్నాట‌క వ‌ల‌స కూలీల నోడ‌ల్ ఆఫీస‌ర్ రైల్వేశాఖ‌కు లేఖ రాశారు. నిర్మాన రంగ ఏజెన్సీల‌తో సీఎం చ‌ర్చ‌లు జ‌రిపారు.  మెట్రో, బీఐఏఎల్ ప్రాజెక్టుల‌తో మాట్లాడిన ఆయ‌న‌.. నిర్మాణ ప‌నుల‌కు ప‌చ్చ‌జెండా ఊపారు. వెంట‌నే నిర్మాణ ప‌నులు మొద‌లుపెట్టాల‌ని ఆదేశించారు. గత రెండు రోజుల క్రితం బెంగుళూరు ఇంట‌ర్నేష‌న‌ల్ ఎగ్జిబిష‌న్ సెంట‌ర్ వ‌ద్ద సుమారు ప‌ది వేల మంది వ‌ల‌స కార్మికులు రెండు రోజుల క్రితం భారీ ఆందోళ‌న చేపట్టిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో నిర్మాణ ప‌నుల‌కు ప‌చ్చ‌జెండా ఊపారు. వెంట‌నే నిర్మాణ ప‌నులు మొద‌లుపెట్టాల‌ని ఆదేశించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: