క‌రోనా వైర‌స్ క‌ట్ట‌డికి దేశ‌వ్యాప్తంగా కొనసాగుతున్న‌ లాక్‌డౌన్‌తో చిక్కుకుపోయిన వలస కూలీల త‌ర‌లింపున‌కు కేంద్రం అనుమ‌తి ఇచ్చిన విష‌యం తెలిసిందే. అప్ప‌టి నుంచి భారతీయ రైల్వే శాఖ రైళ్ల‌లో కార్మికులు, కూలీల‌ను సొంత‌రాష్ట్రాల‌కు తరలిస్తున్నది. వలస కార్మికులు వారి సొంతూళ్ల‌కు వెళ్లడానికి కేంద్ర ప్రభుత్వం అనుమతించడంతో రాష్ర్టాలు వారికి కావాల్సిన సౌకర్యాలను ఏర్పాటు చేస్తున్నాయి.  గత ఐదు రోజుల్లో 70 ప్రత్యేక రైళ్లలో సుమారు 80 వేల మంది వలస కార్మికులను తరలించినట్లు రైల్వే శాఖ వెల్లడించింది. దీంతో సోమవారం నాటికి 55 రైళ్లు వివిధ రాష్ర్టాల్లోని గమ్యస్థానాలకు చేరాయని, మరో 30కిపైగా రైళ్లు మంగళవారం చేరుకున్నాయని రేల్వై అధికారులు పక్రటించారు. ప్రతి రైల్లో సుమారు వెయ్యి నుంచి 1200 మంది కార్మికులు, విద్యార్థులు, తీర్థయాత్రికులు ఉంటున్నారని అధికారులు తెలిపారు.

 

అయితే.. వలస కార్మికుల కోసం ఏర్పాటు చేసిన ఈ ప్రత్యేక రైళ్లు ఎక్కువగా ఉత్తరప్రదేశ్‌, రాజస్థాన్‌, మధ్యప్రదేశ్‌, ఛత్తీస్‌గఢ్‌, జార్ఖండ్‌, బీహార్‌, గుజరాత్‌, ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ర్టాల మ‌ధ్య‌నే న‌డుస్తున్నాయ‌ని అధికారులు తెలిపారు. వలస కూలీల టికెట్‌ ఖర్చులను ఉత్తరప్రదేశ్‌, రాజస్థాన్‌, మధ్యప్రదేశ్‌, ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రలు పూర్తిగా భరిస్తున్నాయి. అలాగే, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌, గుజరాత్‌ రాష్ర్టాలు తమ వద్ద నుంచి వెళ్తున్న వల కూలీల ఖర్చులను భరిస్తున్నాయి. బీహార్‌, జార్ఖండ్‌ రాష్ర్టాలు తమ రాష్ర్టానికి వచ్చే కూలీలకు టికెట్లకు డబ్బులు చెల్లిస్తున్నాయి. 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: