కరోనావైరస్ నియంత్ర‌ణ‌కు కేంద్ర ప్ర‌భుత్వం లాక్‌డౌన్ విధించిన విష‌యం తెలిసిందే. లాక్‌డౌన్ కార‌ణంగా పేద‌లు తీవ్ర ఇబ్బందులు ప‌డుతున్నారు. వీరి క‌ష్టాల‌ను తీర్చేందుకు కేంద్ర ప్ర‌భుత్వం చ‌ర్య‌లు తీసుకుంటోంది. ఇందులో భాగంగా వారికి ఆర్థిక సాయం కూడా అందిస్తోంది. ప్ర‌ధాన్ మంత్రి గ‌రీభ్ క‌ల్యాణ్ ప్యాకేజీ(పీఎంజీకేపీ) కింద సుమారు 39 కోట్ల మంది పేద ప్రజలకు 34,800 కోట్ల రూపాయల ఆర్థిక సాయం అందించిన‌ట్లు కేంద్ర ప్ర‌భుత్వం ప్ర‌క‌టించింది. ఈ మేర‌కు కేంద్ర ఆర్థిక శాఖ వివ‌రాల‌ను ట్విట్ట‌ర్‌లో వివ‌రాల‌ను పొందుప‌ర్చింది. అయితే.. ఈ డ‌బ్బుల‌ను నేరుగా ప్ర‌జ‌ల ఖాతాల్లో జ‌మ చేసింది.

 

రెండో ప్యాకేజీ కింద కూడా పేద ప్ర‌జ‌ల‌కు సాయం అందించే దిశ‌గా కేంద్ర ప్ర‌భుత్వం క‌స‌ర‌త్తు చేస్తోంది. మే 3వ తేదీ త‌ర్వాత కూడా లాక్‌డౌన్‌ను పొడిగించ‌డంతో ప్ర‌జ‌లు ఇబ్బందులు ప‌డ‌కుండా.. మ‌రింత సాయం అందించే దిశ‌గా ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర‌మోడీ ఆలోచిస్తున్న‌ట్లు ప‌లువురు విశ్లేష‌కులు అంచ‌నా వేస్తున్నారు. ఇక క‌ష్ట‌కాలంలో డ‌బ్బులు అందుతుండ‌డంతో పేద‌ప్ర‌జ‌లు ఆనందం వ్య‌క్తం చేస్తున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: