ఉత్త‌ర‌ప్ర‌దేశ్ స‌ర్కార్ సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకుంది. క‌రోనా వైర‌ప్‌పోరాడుతున్న కొవిడ్ వారియ‌ర్స్‌కు అండ‌గా నిలిచింది. విధుల్లో నిమగ్నమైన ప్రభుత్వ ఉద్యోగులు, వైద్యులు, పోలీసు సిబ్బందిపై దాడి చేసే వారిపై క‌ఠిన నిర్ణ‌యం తీసుకుంది. ఇందుకోసం ప్ర‌త్యేక ఆర్డినెన్స్‌ను తీసుకొచ్చింది.  చట్టాలను మరింత కఠినతరం చేసే ఆర్డినెన్స్‌ను రాష్ట్ర మంత్రివర్గం ఆమోదించింది.  ఉత్తర ప్రదేశ్ ఎపిడ‌మిక్‌ చట్టం 2005లో భాగంగా ఈ ఆర్డినెన్స్‌ను తీసుకొచ్చింది. ప్ర‌భుత్వ ఉద్యోగులు, వైద్యులు, పోలీసుల‌పై దాడికి పాల్ప‌డిన వారికి ఏకంగా 2 నుండి 5 సంవత్సరాల వరకు జైలు శిక్ష , 2 లక్షల రూపాయల వరకు జరిమానా విధించనున్న‌ట్లు ప్ర‌క‌టించారు.

 

అలాగే, క్వారంటైన్ నిబంధ‌న‌ల‌ను ఉల్లంఘించిన వారిపై కూడా క‌ఠినంగా వ్య‌వ‌హ‌రిస్తామ‌ని ప్ర‌భుత్వం ప్ర‌క‌టించింది. క్వారంటైన్ నిబంధ‌న‌లు ఉల్లంఘిన వారికి రూ.10వేల నుంచి రూ.10ల‌క్ష‌ల వ‌ర‌కు జ‌రిమానా, ఏడాది నుంచి మూడేళ్ల వ‌ర‌కు జైలు శిక్ష విధించేలా ఆర్డినెన్స్‌ను తీసుకొచ్చింది. కాగా, ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లో క‌రోనా వైర‌స్ ప్ర‌భావం ఎక్కువ‌గా ఉంది. ఇప్ప‌టివ‌ర‌కు 2,859 క‌రోనా పాజిటివ్ కేసులు న‌మోదు అయ్యాయి. ఇప్ప‌టివ‌ర‌కు 53 మ‌ర‌ణాలు సంభ‌వించాయి. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: