దేశంలో ఎప్పుడైతే కరోనా మహమ్మారి ప్రభావం చూపించడం మొదలు పెట్టిందో అప్పటి నుంచి ఇతర రాష్ట్రాల నుంచి రాకపోకలపై పలు అనుమానాలు మొదలయ్యాయి.  దాంతో సరిహద్దల్లో గట్టి కాపలా పెట్టిన విషయం తెలిసిందే. ఆ మద్య తమిళనాడు బార్డర్ లో గొడలు కూడా కట్టారు. తాజాగా  చెన్నై కోయంబేడు కూరగాయల మార్కెట్‌లో కరోనా వ్యాప్తి నేపథ్యంలో.. చిత్తూరు జిల్లా నుంచి వెళ్లే కూరగాయల వాహనాలను తమిళనాడు పోలీసులు ఆపేశారు. అంతే కాదు రాకపోకలు ఆపేందుకు అక్కడ రోడ్డును జేసీబీతో తవ్వించారు. అయితే ఇది కరోనా వ్యాప్తిని అరికట్టడానికి అన్నట్లు వారు అంటున్నారు.  ప్రస్తుతం తమిళనాట కరోనా కేసులు విపరీతంగా పెరిగిపోతున్న విషయంతెలిసిందే. 

 

కాగా, హనుమంతాపురంలో ఒక వీధి తమిళనాడు పరిధిలోకి, ఒక వీధి ఆంధ్రా పరిధిలోకి వస్తుంది. దీంతో పోలీసులు తమిళనాడులోకి వచ్చే వీధిలో రోడ్డును తవ్వించారు. గత కొంత  కాలంగా  కోయంబేడు కూరగాయల మార్కెట్ నుంచి చిత్తూరు జిల్లాలోని శ్రీకాళహస్తి, తిరుపతికి నిత్యం కూరగాయల సరఫరా జరుగుతుంటుంది.  ఇక కోయంబేడు నుంచి కూరగాయలు రావటం ద్వారా కరోనా వ్యాపించవచ్చు అని తెలిసినా ఏపీ ప్రభుత్వం మాత్రం ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: