ఏపీ ప్ర‌భుత్వం విద్యార్థుల‌కు శుభ‌వార్త చెప్పింది. విద్యార్థులు ఎంతో ఉత్కంఠ‌గా ఎదురుచూస్తున్న ప‌లు సెట్ల నిర్వ‌హ‌ణ తేదీల‌ను రాష్ట్ర ప్ర‌భుత్వం ఈ రోజు ప్ర‌క‌టించింది. ఎంసెట్‌, ఎడ్‌సెట్‌, పీఈసెట్, ఐసెట్‌, ఈసెట్‌, పీజీసెట్ల‌ నిర్వ‌హ‌ణ తేదీల‌ను ఖరారు చేసింది. జూలై 27వ తేదీ నుంచి 31వ‌ర‌కు ఎంసెట్‌, జూలై 24న‌ ఈసెట్‌, జూలై 25న‌ ఐసెట్‌,  ఆగ‌స్ట్ 2వ తేదీ నుంచి 4వ తేదీ వ‌ర‌కు పీజీసెట్‌, ఆగ‌స్ట్ 5న ఎడ్‌సెట్‌, ఆగ‌స్ట్ 6న లాసెట్‌, ఆగ‌స్ట్ 7వ తేదీ నుంచి 9వ వ‌ర‌కు పీఈసెట్ నిర్వ‌హించ‌నున్న‌ట్లు ప్ర‌భుత్వం పేర్కొంది. ఇదిలా ఉండ‌గా ప‌దో త‌ర‌గ‌తి పరీక్ష‌ల‌పై కూడా విద్యాశాఖ మంత్రి ఆదిమూల‌పు సురేశ్ క్లారిటీ ఇచ్చారు.

 

ప‌దో తరగతి పరీక్షలు నిర్వహించే విషయంపై త్వరలోనే నిర్ణయం తీసుకుంటామని అన్నారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. లాక్‌డౌన్‌ పూర్తిగా ఎత్తేసిన త‌ర్వాతే ప‌దో తరగతి పరీక్షలపై నిర్ణయం ఉంటుందని స్పష్టం చేశారు. దీనిపై ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి కూడా సమీక్షిస్తున్నారని చెప్పారు. ఈ నేపథ్యంలో సామాజిక దూరం పాట్టిస్తూ పరీక్ష కేంద్రాలను కుందించాలా లేక యదావిధిగా సాగించాలా అనే విషయంపై సీఎం జగన్‌తో చర్చించి నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. కాగా పరీక్షలపై సోషల్‌ మీడియాలో వస్తున్న పుకార్లను ఎవరూ నమ్మొద్దని విద్యార్థులకు, తల్లిదండ్రులకు సూచించారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: